NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Mallik Paruchuri: మల్లిక్ పర్చూరి ఎవరు.? కేసు ఏమిటి..!? పోరాటం ఎందుకు..!? సంచలన విషయాలు ఇవీ..!!

Mallik Paruchuri: మల్లిక్ పరుచూరి రిసెర్చ్ సైంటిట్స్. కోవిడ్ 19 చికిత్స, ప్రోటోకాల్, కోవిడ్ వ్యాక్సిన్ తదితర విషయాలపై యూట్యూబ్ వీడియో ప్రసారం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు. విశాఖకు చెందిన మల్లిక్ కోదాడలోని రామకృష్ణ రెసిడెన్షియల్ హైస్కూల్ లో చదువుకున్నారు. కెమికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఫోజ్జో స్ఫేర్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్నారు. కరోనా మొదటి వేవ్ నుండి కరోనా వైద్య విధానంలో లోపాలు, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ, మెడికల్ మాఫియా తదితర అంశాలపై తన కోవికేర్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది ఫాలోవర్స్ అయ్యారు. లక్షలాది మంది ఆయన వీడియోలను వీక్షిస్తున్నారు.

who is chemical engineer Mallik Paruchuri
who is chemical engineer Mallik Paruchuri

కొద్ది రోజుల క్రితం ఓ టీవి చర్చా కార్యాక్రమంలో కోరనా థర్డ్ వేవ్ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో వేవ్ అత్యంత భయానకరంగా ఉంటుందనీ, వ్యాక్సిన్ లు పని చేయబోవని, పిల్లలపై అధిక ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇంటికి ఒకరు చనిపోతారంటూ కూడా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మల్లిక్ పై మండిపడ్డారు. మల్లిక్ సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఆ నేపథ్యంలోనే ఆయనను వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వీడియోను దాదాపు అయిదు లక్షల మందికి పైగా వీక్షించి రకరకాల కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మల్లిక్ పై కేసు నమోదు చేయడాన్ని రాం గోపాల్ వర్మ తప్పుబట్టారు. మల్లిక్ మాట్లాడిన మాటలు తప్పుడవని ఎలా కొట్టిపారేస్తారని వర్మ ప్రశ్నించారు. ప్రభుత్వానికి రాంగోపాల్ వర్మ ప్రశ్నలను సంధించారు.

Read More: Paruchuri Malik hunger strike: నిరాహార దీక్షకు సిద్ధపడ్డ కెమికల్ ఇంజనీర్ పరుచూరి మల్లిక్..! ఎందుకంటే.. ?

ఈ వివాదాల నేఫథ్యంలో మల్లిక్ అఫిషియల్ వాట్సాప్ నెంబర్ ను బ్లాక్ చేశారు. తనపై మెడికల్ మాఫియా ఆర్గనైడ్జ్ అటాక్ చేస్తుందని మల్లిక్ ఆరోపిస్తున్నారు. వాట్సాఫ్ గ్రూపులను బ్లాక్ చేయడం, వాలంటీర్లకు ఫోన్ చేసి బెదిరించడం, సోషల్ మీడియా ద్వారా కూడా తన వాయిస్ ప్రజలకు చేరకుండా చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. విశాఖ గాజువాక ఆలూరి టవర్స్ లోని తన నివాసం వద్ద మల్లిక్ పరుచూరి నేడు నిరాహార దీక్షకు కూర్చున్నారు. దీనిపై వేలాది మంది సోషల్ మీడియా ఫాలోవర్స్ ఆయనకు సంఘీభావం తెలియజేస్తున్నారు. తాను కరోనా వైద్య విధానాలకు సంబంధించి 53 ప్రశ్నలు సంధిస్తే ఒక్క దానికి రిప్లై ఇవ్వలేదన్నారు మల్లిక్, థర్త్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కొంటారు. పిల్లలను ఎలా రక్షిస్తారు, డేల్టాప్లస్ ను ఎలా ఎదుర్కొంటారు అంటే వేటికీ సమాధానం ఇవ్వలేదన్నారు.

Related posts

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju