NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: కాంగ్రెస్‌లో శ‌త్రువుల‌ను పెంచుకుంటున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణ పీసీసీ ర‌థ‌సార‌థిగా ప‌ద‌వీ బాధ్య‌తలు చేప‌ట్టిన రేవంత్ రెడ్డి ఈ మేర‌కు త‌న‌దైన శైలిలో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. పార్టీ శ్రేణుల్లో చైత‌న్యం పెంచేందుకు తాజాగా పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేప‌ట్టారు. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను టీఆర్ఎస్ నేతలు, అధికారులు ఇబ్బందిపెడితే తోడుకలు తీస్తామని.. ఎవ్వర్నీ వదిలిపెట్టబోమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎవరు ఏమేం చేస్తున్నారో అందరి చిట్టభారతం డైరీలో రాసిపెట్టుకుంటున్నామని.. ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇంటిదొంగలు ఎవరైనా ఉంటే నెలలోపు సర్దుకోవాలని ఆయన హెచ్చరించారు.

Read More: Revanth Reddy: ఇటు కేటీఆర్‌ను అటు కిష‌న్ రెడ్డిని కెలికిన రేవంత్‌

రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

హుజురాబాద్‌ నియోజకవర్గం నేత‌ కౌశిక్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ లోని ఇంటి దొంగలను విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్‌ ఇంటి దొంగలకు నెలాఖరు వరకు డెడ్‌లైన్‌ ఇస్తున్నాను….ఎవరైనా ఉంటే పరారు అవ్వాలంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇంటి దొంగలను వదిలిపెట్టేదిలేదని రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడేవారిని వదులుకునేది లేదని రేవంత్ హామీ ఇచ్చారు.

Read More: Revanth Reddy: రేవంత్ పై అదిరిపోయే కామెంట్ చేసిన హ‌రీశ్

ఆ మాట‌లు బాధ పెట్టేవే…

పార్టీ కోసం కష్టపడేవారిని గుండెల్లో చేర్చుకుని, దగ్గర పెట్టుకుని చూసుకునే బాధ్యత కూడా త‌మ‌ద‌ని తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి హమీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలోని ఇంటి దొంగలకు సీరియస్‌ వార్నింగ్ అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్య‌లు స‌హ‌జంగానే క‌ల‌క‌లం సృష్టించేవే. అదే స‌మ‌యంలో ఇది పార్టీలోని కొంద‌రికి కంట‌గింపుగా మారి ఆయ‌న్ను శ‌త్రువుగా భావిస్తార‌ని చెప్తున్నారు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N