NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: రేవంత్ పై అదిరిపోయే కామెంట్ చేసిన హ‌రీశ్

Revanth Reddy: గ‌త కొద్దికాలంగా హాట్ టాపిక్ గా మారిన పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి నియామ‌కం గురించి ఆయా రాజ‌కీయ పార్టీల నేత‌లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిపిఐ తాజాగా సీఎం కేసీఆర్ మేన‌ల్లుడు, మంత్రి హ‌రీశ్ రావు త‌న‌దైన శైలిలో స్పందించారు. సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు పర్యటించారు. టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో బెజ్జంకి కమాన్ నుంచి బెజ్జంకి వరకూ భారీ బైక్ ర్యాలీతో పాటు పుష్పగుచ్ఛం, శాలువాతో మంత్రికి గ్రామ, మండల ప్రజాప్రతినిధులు హరీశ్ రావుకి ఘన స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, చంద్రబాబే మళ్లీ కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి వస్తున్నారని మంత్రి హరీశ్ అన్నారు.

Read More: Revanth Reddy: రేవంత్‌ను కోమ‌టిరెడ్డి ఓ రేంజ్‌లో కెల‌కుతున్నారుగా…

చంద్ర‌బాబు ఇలా వ‌స్తున్నార‌ట‌…
చంద్రబాబు ఆనాడు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే ఆంద్రాబాబు అని ప్రజలు వెల్లగొట్టారని హ‌రీశ్ రావు ఆరోపించారు. టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని, తన మనుషులను కాంగ్రెస్ లోకి పంపి తెలంగాణలో చంద్రబాబు అడుగు పెడుతున్నారని ప‌రోక్షంగా రేవంత్ రెడ్డి గురించి కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు తన వాళ్లకు పదవులు ఇప్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎవరు ఓటుకు నోటు కేసులో ఉన్నవాళ్లే కదా. చంద్రబాబు కు అత్యంత‌ సన్నిహితుడు. ఇప్పుడు పీసీసీ‌ చీఫ్ గా వచ్చాడు. అంటూ హ‌రీశ్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Read More: Revanth Reddy: రేవంత్ పై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతున్నది ఎవ‌రో తెలుసా?

70 ఏళ్ల చ‌రిత్ర‌…
70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయని పని టీఆర్ఎస్ చేసిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. “టీఆర్ఎస్ జెండా ఎత్తుకున్నాక.. పొలాల్లో నీళ్లు, ఇంటింటికీ తాగునీళ్లు వస్తున్నాయి. ఏ చెరువు చూసిన నీటితో నిండి ఉన్నాయి. వానలు ఇంకా రాకముందే కాళేశ్వరం నీటితో నిండిపోయాయి. కాంగ్రెస్ హయాంలో క్రాప్ లోన్లు రావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉండేది. బీజేపీ ఏమైనా ఇస్తోందా… ఏమీ ఇవ్వకపోగా ధరలు మాత్రం పెంచి పేదల నడ్డి విరుస్తోంది. డీజిల్ ధర రూ.100 చేసింది. రైతు శ్రేయస్సు కోసం ఎకరానికి టీఆర్ఎస్ 5 వేలు ఇస్తే., డీజిల్ ధర పెంచి బీజేపీ రైతుల పైసలు గుంజేసింది. ఏడేళ్లలో బీజేపీ దేశానికి ఏం చేసింది, పేద ప్రజల కోసం ఏం చేసింది. యేడాదిలో 25/26 రూపాయల పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. దీంతో అన్నీ ధరలు పెరిగాయని హరీశ్ మండిపడ్డారు.

author avatar
sridhar

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju