NewsOrbit
సినిమా

100 శాతం న్యాయం చేశాను – నిహారిక‌

సూర్యకాంతం అనే పేరే ఓ స్పెష‌ల్‌. అలాంటి పేరునే టైటిల్‌గా పెట్టుకుని న‌టించాలంటే ఎంత ధైర్యం ఉండాలో క‌దా.. క‌థ‌పై న‌మ్మ‌కంతో సూర్య‌కాంతంగా మెప్పించ‌నుంది నిహారిక కొణిదెల‌. వ‌రుణ్ తేజ్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌పై నిహారిక కొణిదెల‌, రాహుల్ విజ‌య్ జంట‌గా న‌టించిన చిత్రం `సూర్య‌కాంతం`. ప్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ ఎర్రంరెడ్డి, సుజ‌న్ ఎర‌బోలు, రామ్ న‌రేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తొలి టిక్కెట్‌ను విజ‌య్ దేవ‌ర‌కొండకు నీహారిక గిఫ్ట్ ఇచ్చారు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ “ఈరోజు ఈ సినిమా ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చిందంటే ముందు కార‌ణం మా అన్న వ‌రుణ్‌తేజ్‌. ఎక్క‌డో అమెరికాలోని ప్రొడ్యూస‌ర్స్‌ని, ఇక్క‌డ ఉన్న హీరో, డైరెక్ట‌ర్ అంద‌రినీ క‌లిపి ఓ ఫ‌జిల్ పీస్‌లా సెట్ చేసి సినిమా చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చాడు. మా నిర్మాత‌లు సందీప్, రామ్‌న‌రేష్‌, సుజ‌న్ గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ రాజ్‌గారికి థాంక్స్‌. మా స్క్రిప్ట్‌పై న‌చ్చి, నేను చేయ‌గ‌ల‌ను అని న‌మ్మ‌కంతో సినిమా చేసిన నిర్మాత‌ల‌కు పెద్ద థాంక్స్‌. మా డైరెక్ట‌ర్ ప్ర‌ణీత్‌.. త‌న‌ పేరు ఇండ‌స్ట్రీలో చాలా బాగా విన‌ప‌డుతుంది. అంద‌రం ఫ్యామిలీలా క‌ష్ట‌ప‌డి సినిమా చేశాం. రాహుల్ తో ప‌నిచేయ‌డాన్ని రెస్పెక్ట్‌గా భావిస్తున్నాను. త‌ను మంచి న‌టుడే కాదు.. మంచి వ్య‌క్తి. అందరికీ గౌర‌వం ఇస్తుంటాడు. త‌న నుండి ఆ విష‌యాన్ని నేర్చుకున్నాను. ఈ సినిమాలో త‌ను అభిలాంటి వ్య‌క్తే. అభిగా ఎవ‌రిని తీసుకోవాల‌ని చాలా వెతికాం. కానీ త‌ను మ‌ణికొండ‌లోనే దొరికాడు. త‌న‌లాగానే మ‌రొక‌రు న్యాయం చేయ‌లేరేమో అనిపించింది. ఈ సినిమాలో ప్ర‌తి పాత్ర‌కు త‌గ్గ ఆర్టిస్టులు దొరికారు. పెర్లిన్‌ కూడా చాలా మంచి పాత్ర చేసింది. మార్క్ కె.రాబిన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను మ‌రో లెవ‌ల్‌కి తీసుకెళ్తాయ‌న‌డంలో సందేహం లేదు. హ‌రిగారు ప్ర‌తి విజువ‌ల్‌ను అందంగా చూపించారు. ఆయ‌న ఫ్యూచ‌ర్‌లో పెద్ద సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఎదుగుతారు. సుహాసినిగారు, శివాజీరాజాగారు.. ఇలా చాలా మంది సీనియ‌ర్స్‌తో క‌లిసి న‌టించాను. నా పాత్ర‌కు 100 శాతం న్యాయం చేశాన‌ని అనుకుంటున్నాను. అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను“ అన్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ “నేను నీహారిక వాళ్ల నాన్న‌తో ప‌నిచేశాను. ఆయ‌న చాలా మంచి వ్య‌క్తి. ఆయ‌న్ని చూస్తే నాన్న ఫీలింగ్ వ‌చ్చింది. ఫ‌స్ట్ డే ఆయ‌న‌తో ప‌నిచేసిన‌ప్పుడు న‌న్ను చూసి `నువ్వు మంచోడివేన‌య్యా` అని అన్నారు. ఈ రోజు నాగ‌బాబుగారు పొలిటిక‌ల్ వ‌ర్క్ లో ఉండి, వ‌రుణ్ యుఎస్‌లో ఉండి, చ‌ర‌ణ్ అన్న యుఎస్‌లో ఉండి.. ఇక్క‌డికి రాలేక‌పోయార‌ని తెలిసింది. నేను నాగ‌బాబుగారి కొడుకుగా న‌టించా. అందుకే నీహారిక‌కు అన్న‌గా ఇక్క‌డికి వ‌చ్చాను. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి“ అని అన్నారు. ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్‌ మాట్లాడుతూ “ నా జీవితంలో ఈ సినిమా చాలా స్పెష‌ల్ సినిమా. వ‌రుణ్ అన్న నాకు గైడింగ్ ప‌ర్స‌న్‌. నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. వాళ్లు మాతో అన్న‌ద‌మ్ములుగానే ఉన్నారు. మా కెమెరామేన్ నా ప‌నిని ఈజీ చేశారు. నేను చాలా ఇబ్బంది పెట్టింది రాబిన్‌ని. అత‌నితోనే ఉంటున్నా. కె.కె.గారు సింగిల్ కార్డు రాశారు. మా సూర్య‌కాంతం నాకు ప‌ర్ఫెక్ట్ మోటివేష‌న్‌. త‌ను పెర్ఫార్మెన్స్ చింపేసింది. రాహుల్ విజ‌య్ నాకు బ్ర‌ద‌ర్‌లాంటివాడు. అత‌న్ని సెట్‌లో స‌తాయించేశాను. పూజా క్యార‌క్ట‌ర్‌లో ప‌ర్లిన్ చాలా బాగా చేసింది“ అని అన్నారు. హీరో రాహుల్ విజ‌య్ మాట్లాడుతూ “మా సినిమాకు ప‌నిచేసిన కెమెరామెన్ హ‌రిగారు, సంగీతం అందించిన‌ మార్క్ కె.రాబిన్‌గారు, య‌ష్ మాస్ట‌ర్‌, విజ‌య్ మాస్ట‌ర్‌గారు స‌హా అంద‌రికీ థాంక్స్‌. వ‌రుణ్ అన్న వ‌ల్ల‌నే నేను ఈ స్టేజ్‌పై నిల‌బ‌డి ఉన్నాను. ప్రణీత్‌ను పిలిపించి అభి క్యారెక్ట‌ర్‌కి నేను సూట్ అవుతాన‌ని ఆయ‌నే స‌జెస్ట్ చేశారు. ఫిలిం మేకింగ్ లో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను నిర్మాత‌లు ఏ రోజూ మా వ‌ర‌కు తీసుకు రాలేదు. పూజా చాలా బాగా న‌టించింది. నాకు వాళ్లిద్ద‌రి మీద చాలా గౌర‌వం ఉంటుంది. వాళ్లు ఎక్క‌డుంటే అక్క‌డ అట్మాస్పియ‌ర్ చాలా హ్యాపీగా ఉంటుంది.. ఈ డైర‌క్ట‌ర్‌కి క్లారిటీ ఉంది. నీహారిక‌గారు సూర్య‌కాంతం అనే టైటిల్‌కి యాప్ట్. `నీహారిక నా బెస్ట్ ఫ్రెండ్, త‌ను చాలా మంచి ఆర్టిస్ట్, త‌న‌కి ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌`ని డైర‌క్ట‌ర్ నాతో చెప్పాడు. ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నా. ఈ నెల 29న మా సినిమాను చూడండి“ అని అన్నారు. నిర్మాత సందీప్ మాట్లాడుతూ “ముద్ద‌ప‌ప్పు ఆవ‌కాయ నాకు చాలా బాగా న‌చ్చింది. అప్పుడే `ఫ్యూచ‌ర్‌లో సినిమా చేద్దాం` అని ప్ర‌ణీత్‌తో అన్నా. కొన్నాళ్ల‌కు ఆయ‌న క‌థ చెప్పారు. రాబిన్ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. టీమ్ అంద‌రికీ ధ‌న్యవాదాలు. సినిమా చూశా. చాలా బాగా వ‌చ్చింది. రాహుల్ చాలా అమాయ‌కంగా ఉంటాడు. అత‌నికి ఈ సినిమా మంచి బ్రేక్ కావాలి. క‌న్నారావుగారి ద‌గ్గ‌ర నుంచి టైటిల్ తీసుకున్నాం. రాజ్ నిహార్ చాలా బాగా చూసుకున్నారు. అత‌ను లేకుంటే ఇక్క‌డ మా ప‌నులేవీ కావు“ అని అన్నారు. మార్క్ కె.రాబిన్‌ మాట్లాడుతూ “సూర్యకాంతానికి ప‌నిచేయ‌డం చాలా గొప్ప అవ‌కాశం. ప్ర‌తి అమ్మాయిలోనూ ఒక అర్జున్‌రెడ్డి పాత్ర ఉంటుంది. దాన్ని ఈ సినిమాలో చూస్తారు. మిమ్మ‌ల్ని మీరు ఈ సినిమాలో చూసుకుంటారు“ అని అన్నారు.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Leave a Comment