NewsOrbit
జాతీయం ట్రెండింగ్ రాజ‌కీయాలు

Modi: మోడీకి అస‌లు ప‌రీక్ష నేటి నుంచే… ఎవ‌రిది పై చేయి కానుంది?

Modi:ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి నేటి నుంచి అస‌లు ప‌రీక్ష ఎదురుకానుంది. నేటి నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మొదలు కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మాట్లాడుతూ సభలో నిర్మాణాత్మక, సానుకూల దృక్పథంతో డిబేట్ జరగాలని అన్నారు. రూల్‌ ప్రకారం ఏ టాపిక్‌పై అయినా చర్చించే విషయంలో తాము వెనుకడుగేయబోమని ప్ర‌ధాని తెలిపారు.

Read More: Modi: తండ్రి కాంగ్రెస్‌… కొడుకు బీజేపీ… మోడీ వ‌ల్లే ఇద్ద‌రు క‌లిసి సృష్టించిన‌ రికార్డు ఇది

ఇది స‌మావేశం…
కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్, ప్రహ్లాద్ జోషితో పాటు 33 పార్టీలకు చెందిన సభాపక్ష నేతలతో అఖిల‌ప‌క్ష‌ సమావేశం నిర్వ‌హించారు. కాంగ్రెస్‌ తరఫున మల్లిఖార్జున ఖర్గే, అధిర్‌‌ రంజన్ చౌధరి, తృణమూల్‌ నుంచి డెరెక్ ఒబెరిన్, డీఎంకే నుంచి తిరుచి శివ, సమాజ్‌వాదీ నుంచి రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నుంచి సతీశ్ మిశ్రా, అప్నా దళ్ నుంచి అనుప్రియా పటేల్, ఎల్జేపీ నుంచి పశుపతి పరాశ్ వంటి నేతలు పాల్గొన్నారు. నేటి నుంచి జరిగే ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 30 బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ సందర్భంగా ఎటువంటి అంశాలపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది.

Read More: Modi: మోడీ విష‌యంలో చాలా మంది చేయ‌లేని ప‌ని ఈ యువ మంత్రి చేసేశాడు

మోడీ ఏమంటున్నారంటే…
ధరల పెరుగుదల, కరోనా సెకండ్‌ వేవ్‌ ను కంట్రోల్ చేయడంలో కేంద్రం ఫెయిల్ అయిందని కాంగ్రెస్ సహా పలు పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో అధికార పార్టీని ఓ రేంజ్‌లో టార్గెట్ చేయాల‌ని అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే, ఏ అంశంపైనైనా చర్చకు తమ ప్రభుత్వం సిద్ధమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇటు ప్రతిప‌క్షాల‌ టార్గెట్ ఎత్తుగ‌డలు, అటు అధికార పార్టీ క్లారిటీల ప‌ర్వంలో ఎవ‌రిది పైచేయి కానుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju