NewsOrbit
న్యూస్ సినిమా

Bangarraaju : ‘బంగార్రాజు’ టార్గెట్ కూడా అదేనా..?

Bangarraaju : టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాగార్జున డ్యూయల్ రోల్ లో నటించిన దీనిలో లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా అందుకున్న భారీ సక్సెస్ తో ప్రీక్వెల్ సినిమాగా ‘బంగార్రాజు’ టైటిల్ తో తెరకెక్కాలనుకున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ కి దర్శకత్వం వహించిన కల్యాణ్ కృష్ణ కురసాల ‘బంగార్రాజు’ను తెరకెక్కించనున్నాడు.

is sankranthi target for bangarraaju...?
is sankranthi target for bangarraaju…?

నాగార్జున నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ‘బంగార్రాజు’ సినిమా తెరకెక్కబోతోంది. అయితే గత రెండేళ్లుగా సినిమాకి స్క్రిప్ట్ వర్క్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు సిద్దమయింది చిత్ర బృందం. ‘బంగార్రాజు’ మూవీ కోసం హైదరాబాద్ లోనే ఓ ప్రత్యేకమైన సెట్ నిర్మాణం కూడా పూర్తి చేశారు. ఇక ఆగస్టు 20న ‘బంగార్రాజు’ సెట్స్ మీదకు వస్తోందట. ‘బంగార్రాజు’ సినిమాలో నాగార్జున తో పాటుగా ఆయన తనయుడు నాగచైతన్య కూడా నటించనున్నారు.

Bangarraaju : నాగార్జునకి జంటగా రమ్యకృష్ణ, చైతూ సరసన కృతి శెట్టి..?

అంతేకాదు నాగార్జునకి జంటగా రమ్యకృష్ణ, చైతూ సరసన కృతి శెట్టి నటించనున్నట్లు సమాచారం. ఈనెల 20 నుంచి మొదలయ్యే ఫస్ట్ షెడ్యూల్ లో నాగార్జున – రమ్యకృష్ణలపై కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ఇక విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ‘బంగార్రాజు’ సినిమాను 2022 సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేసుకొని షెడ్యూల్స్ ప్లాన్ చేశారట. అందుకే చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ జరిపి జనవరి 15న ఎట్టి పరిస్థితుల్లోనూ బరిలో దింపనున్నారట. చూడాలి మరి ఈసారి 2022 సక్రాంతికి పెద్ద వార్ ఉండబోతోంది.

Related posts

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri