NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

SVP: సర్కారు వారి పాట సినిమా నుండి మరో సర్ప్రైస్..!!

SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు “గీతా గోవిందం” డైరెక్టర్ పరశురాం దర్శకత్వం లో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంవత్సరన్నరకు పైగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతూ ఉంది. “సరిలేరు నీకెవ్వరు” సినిమా తో హట్రిక్ బ్లాక్ మాస్టర్ విజయాలు నమోదు చేసుకున్న మహేష్.. ఈ సినిమాని గత ఏడాది లాక్ డౌన్ టైం లో ప్రకటించడం జరిగింది. వాస్తవానికి “సరిలేరు నీకెవ్వరు” సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేర్పులు చేసినా గాని మహేష్ కి నచ్చక పోవడంతో ఆ ప్రాజెక్టు పక్కన పెట్టడం జరిగింది.

Sarkaru Vaari Paata teaser highlight revealed

ఆ తర్వాత “సర్కారు వారి పాట” సినిమా మొదలు పెట్టిన మహేష్ మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత కరోనా సెకండ్ వేవ్ రావటంతో షూటింగ్ను ఆపేశాడు. అయితే పరిస్థితులు ఇటీవల అనుకూలించడంతో మళ్లీ షూటింగ్ మొదలు కావడంతో … శరవేగంగా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇటీవల జూలై 31 వ తారీకు సినిమాకి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో “సర్కారు వారి పాట” సినిమా యూనిట్ అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. అయితే సోమవారం అనగా ఆగస్టు 9వ తారీకు మహేష్ బర్త్ డే సందర్భంగా సినిమా నుండి మరో సర్ప్రైజ్ వస్తున్నట్లు ముందుగానే సినిమా యూనిట్ ప్రకటించింది.

 

సరిగ్గా ఆగస్టు 9వ తారీకు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు.. మరొక అప్ డేట్ రిలీజ్ అవుతున్నట్లు  సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్.. ఎక్కువ లైకులు..రీ ట్వీట్ లు సాధించిన పోస్టర్ గా 24 గంటల్లో సోషల్ మీడియాలో రికార్డు సృష్టించింది. దీంతో ఆగస్టు 9వ తారీకు నాడు రిలీజ్ కాబోయే సర్ప్రైస్ తో.. మహేష్ మళ్లీ ఎటువంటి రికార్డులు సృష్టిస్తాడు అన్నది.. ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. సినిమా యూనిట్ టైమింగ్ ప్రకటించడంతో.. ఇప్పటి నుండే సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు.. కొత్త రికార్డులు సృష్టించడానికి పగలగొట్టడం కి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహేష్ బర్తడే కి సరికొత్త రికార్డు “సర్కారు వారి పాట” సినిమా యూనిట్ రిలీజ్ చేసే దానితో గిఫ్ట్ గా తమ అభిమాన హీరోకి అందివ్వాలని.. మంచి జోష్ మీద ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ గోవాలో జరుపుకోనున్నట్లు సమాచారం.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju