NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CBI: సుప్రీం కీలక వ్యాఖ్యలతో సీబీఐలో కదలిక..! న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో మరో ఇద్దరు అరెస్టు..!!

CBI: దేశంలో న్యాయమూర్తులపై దాడులు, దుషణలు అధికం కావడంపై ఇటీవ సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిఘా విభాగం (ఐబీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లు న్యాయవ్యవస్థకు సహకరించడం లేదంటూ కూడా సూప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఏపి హైకోర్టు, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు కేసులో సీబీఐ దూకుడు పెంచింది. మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. శనివారం పి ఆదర్శ్, ఎల్ సాంబశివరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న లింగారెడ్డి రాజశేఖరరెడ్డిని  జూలై 9న కువైట్ నుండి వస్తున్న సందర్భంలో అరెస్టు చేయగా, ఆ తరువాత జూలై 28న దామిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్ లను అరెస్టు చేశారు. శనివారం అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు ఆదర్శ్, సాంబశివరెడ్డిలను కోర్టులో హజరుపర్చినట్లు పేర్కొన్నారు. తాజా అరెస్టులతో అరెస్టు అయిన వారి సంఖ్య అయిదుగురు చేరింది. ఇప్పటి వరకూ 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

CBI arrests another two people for posting defamatory content against judges
CBI arrests another two people for posting defamatory content against judges

ఈ కేసులో వైసీపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ప్రమేయంపైనా దర్యాప్తు జరుపుతున్నామనీ, మొత్తం 16 మందిలో ముగ్గురు విదేశాలలో ఉన్నారనీ, అయిదుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. న్యాయమూర్తులపై వ్యాఖ్యల వెనుక భారీ కుట్ర ఉందని అనుమానిస్తున్నట్లు సీబీఐ అదికార ప్రతినిధి ఆర్ సీ జోషి తెలిపారు. న్యాయమూర్తులపై వ్యాఖ్యల కేసులో విచారణ జరిపి, పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఏపి హైకోర్టు గతంలోనే సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. సీబీఐ, ఐబీ పనితీరుపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీబీఐ నుండి ప్రకటన విడుదల కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju