NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Ycp Leader Arrest: 1200 కోట్ల చిట్ ఫండ్ స్కామ్..! ఆ వైసీపీ నేతను అరెస్టు చేసి తీసుకువెళ్లిన ఒడిశా సీఐడీ పోలీసులు..!!

Ycp Leader Arrest: చిట్ ఫండ్ స్కామ్ కేసులో విశాఖ అధికార వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ ప్రసాద్ ను ఒడిసాలోని భువేశ్వర్  సీఐడీ పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు. వెల్ఫేర్ సంస్థ పేరుతో మళ్ల విజయప్రసాద్ ఆంధ్రప్రదేశ్, ఒడిసా, చత్తీస్‌ఘడ్, తెలంగాణ రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్ వ్యాపారాలు నిర్వహించారు. డిపాజిటర్లను మోసం చేసిన రూ.1200 కోట్ల కుంభకోణంలో ఆయనకు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒడిసాలో డిపాజిట్దారులకు సక్రమంగా చెల్లింపులు జరపకపోవడంతో ఫిర్యాదులు అందాయి. దీనిపై ఒడిసా సీఐడీ పోలీసులు 2019లో విజయప్రసాద్ పై ఐపీసీ సెక్షన్ 420, 406,467, 468, 471, మరియు 120 (బీ) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సోమవారం విశాఖ వచ్చిన ఒడిసా సీఐడీ పోలీసులు స్థానిక ఉన్నతాధికారుల అనుమతితో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేజిహెచ్ లో వైద్య పరీక్షలు చేయించి విశాఖ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ అనుమతితో విజయప్రసాద్ ను ఒడిసాకు తీసుకువెళ్లారు.

Ycp Leader malla vijaya prasad Arrested by odisha cid police
Ycp Leader malla vijaya prasad Arrested by odisha cid police

మళ్ల విజయప్రసాద్ 2009 లో విశాఖ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచారు. 2019 ఎన్నికల్లో విజయప్రసాద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుండి వైసీపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు.  ఆయితే ఆయనను జగన్ సర్కార్ ఇటీవల ఏపి ఎడ్యుకేషనల్ అండ్ వెల్పేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమించింది.

విజయప్రసాద్ కు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినప్పుడే పార్టీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేశాయి. విజయప్రసాద్ సంస్థ వెల్ఫేర్ సంస్థ, వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హదాలో మోసాలకు పాల్పడ్డాడని నాడు కాంగ్రెస్, టీడీపీ నేతలు పేర్కొన్నారు.

కాగా 2016లో వందల కోట్ల చిట్ ఫండ్ మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు కేసులకు సంబంధించి అయిదు రాష్ట్రాల్లో 33 ప్రైవేటు సంస్థలు, కంపెనీ యాజమాన్యాలపై సీబీఐ సోదాలు జరిపింది.  మళ్లా విజయ ప్రసాద్ తో సహా ఆనుమానితుల నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. నాడు మళ్లా ప్రసాద్ నివాసంలో సీబీఐ రూ.44.9 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నది.

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N