NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

YS Sharmila: ఎంఆర్‌పీఎస్ నేత మంద కృష్ణమాదిగతో వైఎస్ షర్మిల భేటీ..! రెండు కారణాలు..!!

YS Sharmila: తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ రాజకీయ అరంగ్రేటం చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిలకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ప్రారంభించిన రెండు నెలల్లోనే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో అంతర్గత సమస్యలు, ప్రాధాన్యత లేకపోవడం తదితర కారణాలతో పలువురు ముఖ్యనేతలు పార్టీని వీడారు. ఇటీవల వైఎస్ఆర్ టీపీ మహబూబ్‌నగర్ పార్లమెంటరీ కన్వీనర్ ఇబ్రహీం, అంతకు ముందు చేవెళ్ల ప్రతాప్ రెడ్డి, ఇందిరా శోభన్ తదితరులు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఈ ఎదురు దెబ్బలను అధిగమించి పార్టీ బలోపేతం చేసుకునేందుకు షర్మిల కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు కారణాలతో ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగతో భేటీ అయ్యారు.

YS Sharmila meet manda krishna madiga
YS Sharmila meet manda Krishna madiga

హైదరాబాద్ విద్యానగర్ లోని మంద కృష్ణమాదిగ నివాసానికి  వెళ్లిన షర్మిల ఆయనను పరామర్శించారు. మంద కృష్ణమాదిగకు ఇటీవల ఢిల్లీలో శస్త్ర చికిత్స జరిగింది. అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆక్షాంక్షించారు. మందా కృష్ణమాదిగను పరామర్శించిన విషయాన్ని షర్మిల ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కృష్ణమాదిగను షర్మిల కలవడంలో మొదటి కారణం పరామర్శించడం కాగా రెండవ విషయం వైఎస్ఆర్ టీపీ నిర్వహిస్తున్న దళిత భేరికి ఆయనను ఆహ్వానించడం.

సెప్టెంబర్ 12వ తేదీ ఆదివారం నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో వైఎస్ఆర్ టీపీ నిర్వహిస్తున్న దళిత భేరి బహిరంగ సభకు షర్మిల..కృష్ణమాదిగను ఆహ్వానించారు. దళితుల పక్షాన వైఎస్ఆర్ టీపీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని కృష్ణమాదిగను షర్మిల కోరారు.  కేసిఆర్ సర్కార్ కు మంద కృష్ణమాదిగ వ్యతిరేకంగా ఉన్నందున వైఎస్ఆర్ టీపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉద్యమ నాయకుడుగా పేరున్న మంద కృష్ణమాదిగను పరామర్శ కోసమైనా షర్మిల  కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju