NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Coconut: కొబ్బరి బోండాం నీళ్లు తాగి అందులో ఉన్న కొబ్బరిని పారేస్తున్నారా..!? అయితే ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!!

Coconut: మార్కెట్లో లభించే వివిధ కూల్ డ్రింక్స్ తాగడానికి ప్రజలు అలవాటు పడిపోయారు.. ఆరోగ్యం బాగోక పోతే అప్పుడు అడపదడపా జ్యూసులు తాగుతున్నారు.. అవసరం అయితేనే తప్ప.. లేదంటే డాక్టర్లు సూచిస్తేనో కొబ్బరి బొండం నీళ్లు తాగే వాళ్ళు అతి తక్కువ మంది..!! కొంతమంది సాధారణంగానే కొబ్బరి బొండం నీళ్లు తాగుతుంటారు..!! కొబ్బరి బొండం నీళ్ళు తాగి ఆ బొండం లోపల ఉన్న కొబ్బరిని అందరూ పారేస్తూ ఉంటారు..!! ఈ కొబ్బరిని తింటే ఆరోగ్యానికి బోనస్ పాయింట్..!! అయితే కొబ్బరి బొండం లోపల ఉన్న లేత కొబ్బరినీ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..!!

Coconut: water health benefits
Coconut: water health benefits

లేత కొబ్బరి లో విటమిన్ ఏ, బి, సి సమృద్ధిగా లభిస్తాయి. ఇంకా ఇందు లో ఐరన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్స్, రైబోఫ్లెవిన్, నియాసిన్ థయామిన్ అధికంగా ఉన్నాయి. ఇది చక్కటి న్యూట్రిషన్ ఫుడ్.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. బరువు తగ్గాలను కునేవారు కొబ్బరి ని తినాలి. దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి ఈ లేత కొబ్బరి చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు ఇది జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. అజీర్తి, జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చేస్తుంది. ఈ కొబ్బరి పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. ఎండాకాలం డీహైడ్రేషన్ బారినపడకుండా కాపాడుతుంది.

Coconut: water health benefits
Coconut: water health benefits

కొబ్బరి బొండం లోని తెల్లని గుజురు మంచి ఆహారం. దీనిలో తక్కువ శాతం కొవ్వు పదార్థాలు ఉంటాయి. మూత్ర సంబంధిత జబ్బులను, కిడ్నీలో రాళ్ల సమస్యకు ఇది చక్కగా పనిచేస్తుంది. కొబ్బరి నీళ్లు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. కొబ్బరి బొండం నీళ్ళు బెస్ట్ ఎనర్జీ డ్రింక్ గా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నీటిని అందులో ఉన్న కొబ్బరి నీ తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం గుండెజబ్బుల రానివ్వకుండా చేస్తుంది. వేసవి కాలం లో శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవిలో చెమట కాయలు, వేడి కురుపులు, చికెన్ ఫాక్స్ తగ్గడానికి ఇది దోహదపడుతుంది. అలాగే కడుపులో ఉన్న నూలు పురుగులను హరిస్తుంది. ఈ లేత కొబ్బరి లో పంచదార వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ సారి మీరు కొబ్బరి బొండం నీళ్లు తాగినప్పుడు అందులో ఉన్న కొబ్బరిని కూడా టేస్ట్ చేయండి. ఒక్కసారి దీని రుచి తెలిస్తే అస్సలు వదులరు..

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N