NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Somu Veerraju: జగన్ సర్కార్ పై ‘సోము’ సీరియస్ అయ్యారు..! ఎందుకంటే..?

Somu Veerraju: ఏపిలో ఇంతకు ముందు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పాఠశాలలు, ప్రభుత్వ ఆస్తులకు వేసిన వైసీపీ రంగులు తొలగించాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఆ తరువాత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్లినా హైకోర్టు తీర్పునే సమర్ధించింది. దీంతో హైకోర్టు తీర్పు మేరకు పాఠశాలలకు వేసిన రంగులను తొలగించారు. దీని వల్ల ప్రభుత్వానికి లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లింది. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కేంద్ర ప్రభుత్వం వివిద కార్పోరేషన్లు మున్సిపాలిటీలలో చెత్త సేకరణకు గానూ సరఫరా చేసిన వాహనాలకు కూడా మూడు రంగులు వేయడం వివాదాస్పదం అవుతోంది. ఈ చర్యలను ఏపి బీజేపీ తప్పబడుతోంది.

Somu Veerraju fires on ap govt
Somu Veerraju fires on ap govt

Somu Veerraju: చెత్త సేకరణ వాహనాలు పరిశీలన

ఏపీ బీ జే పీ అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం గుంటూరులోని పలు ప్రాంతాల్లో చెత్త సేకరణ వాహనాలను పరిశీలించారు. వాటిపై జగన్ పేరుతో స్టిక్కరింగ్, వైసీపీ రంగులు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేసినందుకు హైకోర్టు నుండి మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో మార్పు రాలేదని సోము వీర్రాజు దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయడం మానేసి తిట్ల దండకంతో సరిపెడతోందని విమర్శించారు. రాష్ట్రంలో సింగిల్ స్టిక్కర్ విధానం పోయి డబుల్ స్టిక్కర్ విధానం అమల్లోకి వచ్చిందని సెటైర్ వేశారు.

Somu Veerraju: వాహనాలపై మోడి స్టిక్కర్ వేయాలి

గ్రామాలు, నగరాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం స్వచ్చ సంకల్పం, స్వచ్చభారత్, స్వచ్చ సర్వేక్షణ కార్యక్రమాలను 2014 నుండి అమలు చేస్తున్న విషయాన్ని సోము వీర్రాజు గుర్తు చేశారు. ఏడాదికి రూ.1500 కోట్ల నిధులను నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, గ్రామాలకు విడుదల చేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారంతో నిధలు ఇస్తున్నా చెత్త సేకరణ వాహనాలపై ప్రధాన మంత్రి మోడీ బొమ్మ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ రంగులు ఎలా వేస్తుందని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి మోడీ ఫోటోను రాష్ట్రంలో ప్రజలకు కనిపించకుండా చేయాలనే జగన్ ప్రయత్నాన్ని తాము తిప్పి కొడతామని సోము వీర్రాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన ఈ వాహనాలపై తక్షణం పీ ఎం మోడీ ఫోటో వేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి చాలా నిధులు వస్తున్నాయని అయినా ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని సోము వీర్రాజు విమర్శించారు.

 

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!