NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Fruits: ఈ పండ్లను ఎప్పటికీ కలిపి తినకండి.. ఎందుకంటే..!?

Fruits: పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. డాక్టర్లు కూడా ప్రతిరోజు ఏదో ఒక పండును కచ్చితంగా తినమని సూచిస్తారు.. అయితే పండ్లను కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకూడదని కొంతమందికి తెలుసు.. అలాగే కొన్ని పండ్లను కొన్ని రకాల పండ్ల తో కలిపి తీసుకోకూడదని ఎక్కువ మందికి తెలియదు.. ఏ పండ్లు ఏ పండ్లతో కలిపి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..!! ఇలా తీసుకోవడం వలన ఆరోగ్యానికి కలిగే నష్టం గురించి చర్చించుకుందాం..!!

Never Eat These type of Fruits: Combinations
Never Eat These type of Fruits: Combinations

Fruits: పొరపాటున ఈ పండ్లను కలిపి తినకండి..!!

పండులలో కొన్ని సహజ సిద్ధంగానే తీయదనాన్ని కలిగి ఉంటాయి. అటువంటి పళ్లను కలిపి అస్సలు తీసుకోకూడదు. నేరేడు, దానిమ్మ పండ్లను కలిపి తీసుకోకూడదు. ఒకవేళ తింటే కడుపు లో మంట, అసిడిటీ, అజీర్ణం, గుండెల్లో మంట వస్తుంది‌ ఎందుకంటే ఈ రెండింటి లో చక్కెర ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అందువలన మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం కాకుండా చేస్తుంది .జీర్ణం అవటానికి అవసరమైన ఎంజైమ్స్ ను కూడా నశింపజేస్తాయి.

Never Eat These type of Fruits: Combinations
Never Eat These type of Fruits: Combinations

 

పుచ్చకాయ, కర్బూజ కూడా కలిపి తినకూడదు. వీటి వలన కూడా అజీర్తి సమస్య వస్తుంది. అరటిపండును జామకాయను కలిపి తినటం ఆరోగ్యానికి ప్రమాదమని డైటీషియన్ నిపుణులు చెబుతున్నారు.ఈ రెండింటినీ కలిపి తినడం వలన ఉదర సంబంధిత సమస్యలతో పాటు తలనొప్పి కూడా వస్తుందని చెబుతున్నారు. బొప్పాయి పండు తో నిమ్మకాయ కలిపి తీసుకుంటే రక్తం లో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గుతాయి. దీని వలన రక్తహీనత ఏర్పడుతుంది.

Never Eat These type of Fruits: Combinations
Never Eat These type of Fruits: Combinations

Fruits: ఫ్రూట్స్ తో కలిపి ఈ కూరగాయలు తినవద్దు..!!

నారింజ కాయ క్యారెట్ ను కలిపి తినకూడదు. ఇది శరీరంలో మూత్రపిండ సమస్యలకు కారణం అవుతుంది. గుండెల్లో మంట వస్తుంది. భోజనం చేసిన వెంటనే పండ్లను తినకూడదు కనీసం ఒక గంట అయినా తర్వాత తీసుకోవాలి. పెరుగు తో కలిపి పుల్లని పండ్లను కలిపి తీసుకోకూడదు. సిట్రస్ పండ్లను పెరుగు తో కలిపి తీసుకోవడం వలన ఉదర సమస్యలు బాధిస్తాయి.

Never Eat These type of Fruits: Combinations
Never Eat These type of Fruits: Combinations

Fruits: పండ్లతో కలిపి ఈ ఆహార పదార్థాలు తినకూడదు..!!

అరటి పండును పాయసం తో కలిపి తినకూడదు. ఎందుకంటే ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వలన శరీరం లో టాక్సిన్స్ ఉత్పత్తి అవుతుంది. దీనివలన పొట్ట బరువుగా అనిపిస్తుంది. పనస పండు ను పాలతో కలిపి తీసుకుంటే చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. పైన చెప్పుకున్న విధంగా ఆ రకమైన ఫ్రూట్ కాంబినేషన్స్ ను తీసుకోకండి. విడి విడిగా పండ్లను తినడమే ఆరోగ్యానికి మంచిది. అలా తింటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ఒక పండు తిన్న తర్వాత కనీసం గంట గ్యాప్ ఇచ్చి మరో రకం పండును తీసుకుంటే మంచిది.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju