NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Pumpkin Seeds: గుమ్మడికాయ గింజలతో ఈ రోగాలు పరార్..!! వీళ్లు ఈ విత్తనాలను తినకూడదు..!?

Pumpkin Seeds: గుమ్మడికాయ ఎంత పెద్ద గా ఉంటుందో.. అందులో అదే పెద్ద మొత్తంలో ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ను కలిగి ఉంది.. గుమ్మడి కాయ చిన్నచిన్న విత్తనాలు అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది ఈ గింజలను తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో.. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ గింజల్ని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Pumpkin Seeds: advantages and disadvantages
Pumpkin Seeds: advantages and disadvantages

Pumpkin Seeds: గుమ్మడికాయ విత్తనాలతో ఈ మొండి వ్యాధులకు చెక్..!!

 

గుమ్మడి కాయ విత్తనాలు శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి ఈ గింజలలో విటమిన్ ఏ, బి, సి, డి లు ఉన్నాయి. ఇంకా ఇందులో క్యాల్షియం, కాపర్, మెగ్నీషియం, జింక్, ఐరన్, పాస్ఫరస్, మాంగనీస్, ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడి కాయ విత్తనాలు తీసుకోవడం వలన శరీరంలో వాపులు, నొప్పులు తగ్గుతాయి. జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవూ. ప్రతిరోజు వ్యాయామం చేసిన తర్వాత గుమ్మడికాయ గింజలను తింటే అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరవని పలు అధ్యయనలలో తేలింది.

Pumpkin Seeds: advantages and disadvantages
Pumpkin Seeds: advantages and disadvantages

పురుషులు గుమ్మడికాయ విత్తనాలను తింటే వీర్యం వృద్ధి చెందుతుంది. సంతాన సాఫల్యత అవకాశాలు పెరుగుతాయి. సంతానోత్పత్తి కి సంబంధించిన సమస్యలు దరి చేరనివ్వదు. కండరాలకు మరమ్మతులు చేయడానికి, కొత్త కణాలను నిర్మించడానికి గుమ్మడికాయ విత్తనాలు అద్భుతంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి కాయ విత్తనాలు లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. దేహం అనేక రకాల వ్యాధుల, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది.

Pumpkin Seeds: advantages and disadvantages
Pumpkin Seeds: advantages and disadvantages

Pumpkin Seeds: ఈ గింజలను వీళ్లు అస్సలు తినకూడదు.. ఎందుకంటే..!?

 

గుమ్మడి కాయ విత్తనాల లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హైబీపీని తగ్గిస్తుంది. అయితే ఈ విత్తనాలను లోబీపీ ఉన్నవారు తినకూడదు. ఎందుకంటే బిపి ని ఇంకా తగ్గిస్తుంది. కాబట్టి లోబీపీ ఉన్నవారు తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ విత్తనాలు తింటే డయాబెటిస్ లెవెల్స్ అదుపు లోకి వస్తాయి. అయితే షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్న వారు ఈ విత్తనాలను తింటే షుగర్ లెవెల్స్ మరింత పడిపోతాయి. అందుకని వీటిని లో షుగర్ ఉన్నవారు తినకూడదు.

Pumpkin Seeds: advantages and disadvantages
Pumpkin Seeds: advantages and disadvantages

ఈ విత్తనాలను గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహా మేరకు మాత్రమే తినాలి. ఈ విత్తనాలు తింటే అనేక రకాల  జీర్ణ సంబంధిత సమస్యలు దరి చేర నివ్వదు. అయితే మరీ ఎక్కువగా తింటే ఉదర సంబంధ సమస్యలు తలెత్తుతాయి. లో బిపి, లో షుగర్, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, జీర్ణాశయ సమస్యలతో బాధ పడేవారు ఈ విత్తనాలను తినకూడదు. మిగతా వారందరూ ఈ గింజలను తిని పైన చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju