NewsOrbit
న్యూస్ సినిమా

Bheemla nayak: పవన్ ఫ్యాన్స్‌కు సాలీడ్ అప్‌డేట్..పాన్ ఇండియన్ సినిమాగా రానున్న ‘భీమ్లా నాయక్’…!

Bheemla nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియన్ సినిమా చేయలేదు. వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ ఆ సినిమాను అప్పటికే హిందీలో, తమిళంలో చూసేశారు కాబట్టి కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. అయితే, ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం 5 భాషలలో రిలీజ్ చేస్తున్నట్టు ఫస్ట్ గ్లింప్స్‌తో మేకర్స్ ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో హరిహర వీరమల్లు రాబోతోంది.

pawan kalyan solid update from bheemla nayak
pawan kalyan solid update from bheemla nayak

అంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా వీరమల్లు అని అందరూ భావించారు. కానీ, తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం అంతకముందే పవన్ నటించిన చిత్రాన్ని పాన్ ఇండియన్ సినిమాగా బహుభాషలలో రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. రానా దగ్గుబాటితో కలిసి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ పవన్ జోడీగా అలరించబోతోంది. అలాగే, రానా జోడీగా సంయుక్త మీనన్ సందడి చేయనుంది. ఇక ఇప్పటికే మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్న డైలాగ్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయో టీజర్స్‌తో ఓ క్లారిటీ వచ్చేసింది.

Bheemla nayak: పాన్ ఇండియన్ సినిమాగా మేకర్స్ పలు భాషల్లో రిలీజ్..!

ఇక భీమ్లా నాయక్ సినిమాను ఆల్రెడీ మలయాళం సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్‌గా నిర్మిస్తున్నారు కాబట్టి మలయాళంలో రిలీజ్ చేస్తారా అనేది కాస్త అనుమానమే. మిగతా నాలుగు భాషలలో మాత్రం కనీసం డబ్బింగ్ వెర్షన్ అయినా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. పవన్ క్రేజ్‌ను బట్టి ఇదే సినిమాను మలయాళంలో డబ్బింగ్ చేసి విడుదల చేసినా చెప్పలేము. చూడాలి మరి ఈ సినిమాను నిజంగా పాన్ ఇండియన్ సినిమాగా మేకర్స్ పలు భాషల్లో రిలీజ్ చేసే వార్తల్లో నిజమెంత ఉందో. కాగా, ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?