హెల్త్

Health Tips: పాదాల కింద దురద వస్తుందా..ఈ గృహ వైద్యం ఒక సారి ట్రై చేయిండి..

Share

Health Tips: చాలా మంది అరికాళ్లలో, పాదాలకి దురద వస్తుంటుంది. వేళ్లతోనో ఏదైనా వస్తువుతోనో ఎంత సేపు గోకినా ఒక్కో సారి తగ్గదు. ఈ సమస్య వల్ల పది మందిలో ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. అన్ ఈజీగా ఉంటుంది.  అటువంటి వాళ్లు గృహ వైద్యం ద్వారా తగ్గించుకునే మార్గాలు ఉన్నాయి. దురద వస్తే ఈ కింద చెప్పిన విధంగా చేయాలి.

Health Tips Itching of the feet
Health Tips Itching of the feet

కొబ్బరి నూనె:  కొబ్బరినూనెలో పోషక పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. మీ కాళ్లకు ఎక్కడ దురద  వేస్తుందో అక్కడ ఒక స్పూన్ కొబ్బరి నూనె వేయండి. నూనె ఆరిపోయే అంత వరకు కూడా అలా ఉంచండి. అప్పుడు తప్పకుండా దురద తగ్గుతుంది.

అలోవెరా జెల్:  చర్మానికి అలోవెరా జెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కడైతే దురద వస్తుందో అక్కడ అలోవెరా ను రాస్తే దురద  తగ్గుతుంది.

నిమ్మ :  నిమ్మ కూడా చాలా రకాల సమస్యలను తగ్గిస్తుంది. నిమ్మరసాన్ని దురద ఉన్న ప్రాంతంలో రాసి ఆ తర్వాత గోరు వెచ్చటి నీళ్లతో కడిగేసుకోండి. ఇది కూడా దురదను తొలగిస్తుంది.

ఉప్పు:   ఉప్పు కూడా దొరదను తొలగిస్తుంది. ఒక టబ్ లో గోరువెచ్చటి నీళ్లు పోసి అందులో కొంచెం ఉప్పు వేసి మీ పాదాలను అందులో ఉంచండి. పదిహేను  నుండి 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తర్వాత కాళ్లని తుడిచి మాయిశ్చరైజర్ రాయండి. ఇలా కూడా దురద సమస్యను తగ్గించుకోవచ్చు.

చిట్కా వైద్యంతోనూ తగ్గకపోతే డెర్మటాలజిస్ట్ (చర్మ వ్యాధి నిపుణులు) ను సంప్రదించి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణ దురద అయితే చిట్కా వైద్యంతో తగ్గించుకోవచ్చు. కానీ సోరియాసిస్ వంటి రుగ్మత అయితే వైద్యులను సంప్రదించి మందులు వాడాల్సి ఉంటుంది.


Share

Related posts

ఉల్లిపాయ మజ్జిగన్నం ఆరోగ్యానికి మంచి చేయడం తో పాటు ఆ విషయం లో ఎలా పని చేస్తుందో తెలుసుకోండి!!

Kumar

Harish Rao: పుట్టిన‌రోజున హ‌రీశ్ రావు సంచ‌ల‌న నిర్ణ‌యం… వైర‌ల్ అవుతున్న ప్ర‌క‌ట‌న‌

sridhar

 Teenage Children: మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉన్నారా ? తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి

siddhu
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar