NewsOrbit
న్యూస్

Akhanda: టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో బాలయ్య “అఖండ”!చాలాకాలం తరవాత పడ్డ యాభై రోజుల పోస్టర్

Akhanda: చాలాకాలం తరువాత టాలీవుడ్ లోయాభై రోజుల పోస్టర్ పడింది.బాక్సాఫీస్ బొనాంజా నందమూరి బాలకృష్ణ నటించిన “అఖండ” సినిమా ఈ ఫీట్ సాధించింది.

Balayya "Akhanda" in Top Place in Tollywood!
Balayya “Akhanda” in Top Place in Tollywood!

ఇరవై నాలుగు కేంద్రాల్లో అఖండ యాభై రోజుల ప్రదర్శనను ఈనెల ఇరవై రెండో తేదీన పూర్తి చేసుకోబోతోంది.ఇంకో విశేషమేమిటంటే అఖండ ఆస్ట్రేలియాలో కూడా అనేక థియేటర్లలో అర్ధ శతదినోత్సవం జరుపుకుంది.

రోజులు కాదు కలెక్షన్లే టాలీవుడ్ లో ఇప్పటి లెక్క!

ఇటీవల తెలుగు పరిశ్రమలో కలెక్షన్స్ నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు తప్ప ఎన్ని రోజులు ప్రదర్శించబడింది అన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.కలెక్షన్స్ బట్టి హిట్టా ఫ్లాపా అన్నది తేల్చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో నాలుగు వారాలు గట్టిగా ఆడిన తెలుగు సినిమా కూడా లేదు.అలాంటిది అఖండ బాక్సాఫీస్ బూజు దులిపేయడమే కాకుండా అద్భుతమైన రన్ తో యాభై రోజుల వరకూ వచ్చేసింది.

Akhanda: కథాంశమే అఖండ కు పెద్ద ప్లస్ పాయింట్!

అఖండ సినిమాలో బాలయ్య విశ్వరూపం చూపారు.అన్ని మసాలాలు సమపాళ్లలో కలపడంతో ఆ సినిమాకు మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది.రక్తపాతం ఎక్కువగా ఉన్నా కూడా కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూసి ప్రేక్షకులు ఆనందించారు ఆదరించారు.మహిళలు ఈ సినిమాకు రారనుకున్న అంచనాలు కూడా తల్లకిందులయ్యాయి. కథాంశం శివుడితో ముడిపడి ఉండటం కూడా అఖండ ఘన విజయానికి మరో ప్రధాన కారణం.

Akhanda: ఇంకా కలిసొచ్చిన అంశాలేమిటంటే?

కరోనా వ్యాప్తి నేపధ్యంలో సంక్రాంతికి విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి ప్యాన్ ఇండియా సినిమాలు వెనక్కు పోవడం అఖండ కు బాగా కలిసి వచ్చింది.సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాలలో ఒక్క టాప్ హీరో నాగార్జున బంగార్రాజు తప్పితే మిగిలిన వన్నీ సోసో మూవీలే.వీటిలో ఒకటి రెండు సినిమాలు విడుదలైన పక్కరోజే ధియేటర్ల నుండి వెళ్లిపోయాయి.దాంతో ఖాళీ అయిన ఆ థియేటర్లలో మళ్ళీ అఖండ సినిమాను వేస్తే హౌస్ ఫుల్స్ అయ్యాయి.కొన్ని సెంటర్లలో అఖండ సినిమా నలభై రోజులు దాటాక కూడా సాలిడ్ కలెక్షన్లు రాబట్టిందని వెబ్ సైట్లు రాసేస్తున్నాయి.ఏదేమైనా అఖండ సినిమా అద్భుత విజయం సాధించిందనేది నిర్వివాదాంశం.ఇందుకు ఆ సినిమా యాభై రోజులు పండగ జరుపుకోనుండడమే నిదర్శనం.టాలీవుడ్ కు కొత్త ఊపును తెచ్చిన అఖండ తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ పేజీని స్వంతం చేసుకుంది.బాక్సాఫీస్ వద్ద బాలయ్య స్టామినాను మరోసారి చాటి చెప్పింది.

 

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju