ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Kuppam Constituency: టీడీపీ నుండి ఆ ఇద్దరూ సస్పెండ్..?

Share

Kuppam Constituency: ఏపిలో రెండు నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఊహించని ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. టీడీపీకి కంచుకోటలుగా ఉన్న చాలా మున్సిపాలిటీలను ఆ పార్టీ  కోల్పోయింది. అందులో మొదటిది టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం. తరువాత అనంతపురం జిల్లా  పెనుగొండ,  పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ లో ఒక్కటంటే ఒక్క డివిజన్ కూడా టీడీపీ గెలుచుకోలేదు. ఏదో ఒడిపోయాం.. రివ్యూ చేద్దాం అన్నట్లు కాకుండా ఓటమికి కారణాలు ఏమిటి..? బలం ఉన్న చోట బలం నిరూపించుకోలేదు అంటే సొంత పార్టీలోనే బలహీనతలు ఉన్నట్లు లెక్క. అంటే వాళ్లకు వాళ్ల బలాన్ని చూపించలేకపోయారు. ఉన్న ఓటర్లను కూడా ఓట్లు వేయించలేకపోయారు. అనుకూలతలను కూడా ప్రతికూలతగా చూపించుకున్నారు అని టీడీపీ చాలా అప్సెట్ లో ఉంది. అందుకే చంద్రబాబు ఆ ఎన్నికల ఫలితాలపై రెండు నెలలు అయినప్పటికీ ఇప్పటికీ రివ్యూలు చేస్తూనే ఉన్నారు. అన్ని నియోజకవర్గాలను రివ్యూలు చేయడం, వాళ్లకు క్లాస్ లు పీకడం, కొంత మందిని పార్టీ నుండి బయటకు పంపించడం జరుగుతోంది.

Kuppam Constituency chandra babu
Kuppam Constituency chandra babu

 

Read More: Kuppam TDP: కుప్పంలో టీడీపీ సీన్ రివర్స్ ..!? చంద్రబాబు తప్పులతో షాకింగ్ న్యూస్..!

Kuppam Constituency:  కుప్పంలో చంద్రబాబు సీరియస్ డెసిషన్స్

గత నెలలో నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఇద్దరు నాయకులను సస్పెండ్ చేశారు. మరో ఇద్దరికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు సీరియస్ డెసిషన్స్ కు సిద్ధం అవుతున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా చంద్రబాబుకు కుప్పంలో మనోహర్ పీఏగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఆయన పరిపాలనా వ్యవహారాల్లో ఉండి నియోజకవర్గంలోకి వెళ్లకపోయినప్పటికీ ఆయన సీఎంగా ఉన్నా లేకపోయినా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పీఏ మొత్తం వ్యవహారాలు చూసుకుంటుండేవారు. మనోహర్  కుప్పం పట్టణంలో ఒక నాయకుడు. వ్యాపారాలు ఉన్నాయి. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో మొన్న ఆయన వైసీపీకీ సరెండర్ అయ్యారు, సరిగా పని చేయలేదు అని ఒక రిపోర్టు ఉంది. నిజానికి కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓడిపోతుంది. ఇన్ని సీట్లు వస్తాయి. అందుకు కారణాలు ఈఈ నాయకులు అని ఎన్నికలకు ముందే ‘న్యూస్ ఆర్బిట్’ లో ఓ కథనాన్ని ఇవ్వడం జరిగింది.

 

ఆ ఇద్దరు నేతలపై

ఇక్కడ మనోహర్ ఏమిచేశారు అంటే.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మనోహార్ కొంత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. అవి కొన్ని నిబంధనలకు విరుద్దంగా ఉండటంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన వాళ్లతో ఇబ్బందులు ఎందుకని మనోహర్ నాయుడు పార్టీ కోసం సిన్సియర్ గా చేయలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయనతో పాటు మండల స్థాయి నాయకుడుగా ఉన్న మునిరత్నం కూడా టీడీపీకి సిన్సియర్ గా చేయలేదట. లోపాయికారీగా వైసీపీకి సహకరించారు అనేది ఆరోపణ. అందుకే పెనుగొండ, నెల్లూరు, ఉండి నియోజకవర్గాలపై  సమీక్ష జరిపి చర్యలు తీసుకునే ముందు చంద్రబాబు.. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఎందుకు ఓడిపోయాము, కారణం ఏవరు, వారిని పార్టీలో ఉంచాలా..? లేదా అనేది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

 

పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా..? లేక పదవుల నుండి తప్పిస్తారా..?

అందుకే పార్టీకి సిన్సియర్ గా పని చేయని మనోహర్ నాయుడు, మునిరత్నంలను పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా..? లేక పదవుల నుండి తప్పిస్తారా..? అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే వీళ్లు దశాబ్దాల నుండి చంద్రబాబు సొంత మనుషులుగా ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు లేకపోయినా మొత్తం నడిపించింది వీళ్లే. అటువంటి వాళ్లపై సీరియస్ డిసెషన్స్ తీసుకోవడం అంత ఈజీ కాదు. వాళ్ల మీద అధికార పార్టీ ఒత్తిళ్ల కారణంగా, లోపాయికారీ గా వీరు గతంలో చేసిన తప్పుల కారణంగా ఇప్పుడు తలొగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు వాళ్లను సస్పెండ్ చేస్తారా..? దూరం పెడతారా..? పదవుల నుండి తీసేస్తారా..? ఏమి చేయబోతున్నారు ..? అనేది కాస్త ఆసక్తికరమైన అంశంగానే మారింది.


Share

Related posts

Happy Life : జీవితం సుఖం గా ఉండడానికి భార్య భర్తకు మన పెద్దలు చెప్పిన కొన్ని సూచనలు!!(పార్ట్-2)

Kumar

జానీ మాస్టర్ లో ఈ టాలెంట్ కూడా ఉందా? ఆ టాలెంట్ చూస్తే మీరు షాకవ్వాల్సిందే..!

Varun G

Koushik Reddy: కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ… అప్పుడే కొత్త వివాదం

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar