NewsOrbit
సినిమా

Lavanya Tripathi: నెటిజ‌న్‌పై లావణ్య త్రిపాఠి ఆగ్ర‌హం.. అంత మాటంటే మండ‌దా మ‌రి!

Lavanya Tripathi Gorgeous Photos

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి.. ఈమె గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అందాల రాక్షసి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ప్ర‌స్తుతం స‌క్సెస్ లేక‌పోవ‌డం వ‌ల్ల అడ‌పా త‌డ‌పా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా ఓ నెటిజ‌న్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

అయితే ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. మత మార్పిడి విషయంలో బలవంతం చేశారంటూ లావణ్య అనే యువ‌తి తమిళ నాడులో ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై నెటిజ‌న్లు మండిప‌డుతూ సోష‌ల్ మీడియాలో జ‌స్టిస్ ఫ‌ర్ లావ‌ణ్య అంటూ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే కొంద‌రు లావ‌ణ్య‌కు బ‌దులుగా లావ‌ణ్య త్రిపాఠి అనే హ్యాష్ ట్యాగ్‌ను వాడుతున్నారు. అయితే దాన్ని సరిచేసే క్రమంలో ఓ నెటిజన్‌ లావణ్య త్రిపాఠిని చీప్ న‌టి అంటూ వ్యాఖ్యానించాడు. `లావణ్య త్రిపాఠి హ్యాష్ ట్యాగ్ వాడకండి. ఆమె ఒక సినీ నటి. లావణ్య తమిళనాడుకు చెందిన ఓ సామాన్య దళిత బాలిక. ధర్మం కోసం ఆమె తన జీవితాన్ని త్యాగం చేసింది. అలాంటి అమ్మాయిని చీప్ నటీమణులతో పోల్చవద్దు` అంటూ కార్తీక్ అగ‌ర్వాల్ అనే ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు.

ఇక అంత మాటంటే మండదా మ‌రి.. అందుకే లావ‌ణ్య త్రిపాఠి వెంట‌నే త‌న‌దైన శైలిలో స‌ద‌రు నెటిజ‌న్‌కి బుద్ధి చెప్పింది. `నీలాంటి మగవాళ్ళు అమ్మాయిల గురించి ఎప్పుడూ చీప్‌గా మాట్లాడతారు. కానీ ఏదైనా ఘోరం జరిగితే మాత్రం వెంటనే ఎక్కడలేని గౌరవాన్ని చూపిస్తారు. ముందు ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేర్చుకో. ఇది చాలా బాధాకరమైన సంఘటన. కానీ సమాజంలోని వాస్తవ పరిస్థితి ఇదే` అని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో రాసుకొచ్చింది. దీంతో లావ‌ణ్య త్రిపాఠికి చాలా మంది మ‌ద్ధ‌తు తెలుపుతున్నారు.

 

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar