NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Minister Seediri Appalaraju: మంత్రి సీదిరికి పోలీస్ షాక్..! జగన్ సీరియస్ ఆదేశాలు..!

AP Minister Seediri Appalaraju: మంత్రి సిదిలి అప్పలరాజుకు పోలీసులకు మధ్య ఓ చిన్న వివాదం తలెత్తింది. సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగితే మంత్రులు ఒక మెట్టు దిగుతారు లేకపోతే పోలీసులే ఒక మెట్టుదిగుతారు. అంతర్గతంగా విచారణ జరుగుతుంది. దీనిలో ఎవరిది తప్పు అనేది కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇది వైసీపీలో పెద్ద ఇష్యూగా చేయడం లేదు. ఇష్యూ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఈ విషయం సీఎం జగన్ వరకూ వెళ్లింది. సీఎం వైఎస్ జగన్ ఇటీవల శారదా పీఠంకు వెళ్లిన సందర్భంగా రెండు ఇష్యూలు తలేత్తాయి. సీఎం పర్యటన నేపథ్యంలో విశాఖ ఎయిర్ పోర్టు రోడ్డులో దాదాపు మూడు గంటల పాటు పోలీసులు ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు. దీంతో చాలా మంది ప్రయాణీకులు జగన్మోహనరెడ్డిని, ప్రభుత్వాన్ని విమర్శించారు. పోలీసుల అత్యుత్సాహాన్ని తప్పుబట్టారు. ఈ ఇష్యూపైన సీఎం వైఎస్ జగన్ స్పందించారు. వెంటనే అధికారులకు ఆ ఘటనపై విచారణ చేయాలని ఆదేశిస్తూ, ఇక పై తన పర్యటనలో ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూడాలని చెప్పారు.

AP Minister Seediri Appalaraju contrivercy issue
AP Minister Seediri Appalaraju contrivercy issue

AP Minister Seediri Appalaraju: పోలీసు అధికారిపై దూర్భాషలాడుతూ

రెండవది మంత్రి సిదిలి అప్పలరాజు విషయం. అప్పలరాజు తన మనుషులతో శారదా పీఠం లోపలకు వెళుతున్న సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ మంత్రి వరకే అనుమతి ఉందని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీఐపై దుర్భాషలాడటం ఇది మీడియాకు రావడంతో సీఎం జగన్ దీనిపైనా స్పందించారు. విచారణ చేయాలని ఆదేశించారు. ఆ ఘటనలో ఎవరిది తప్పు అనే విషయాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై అంతర్గతంగా విచారణ జరుగుతోంది. దీనిపై అక్కడి సీఐని, మంత్రితో పాటు వెళ్లిన వాళ్లను ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో పోలీస్ అధికారుల సంఘం స్పందించి పత్రికా ప్రకటన విడుదల చేసింది. మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. వాస్తవానికి మంత్రి సిదిలి అప్పలరాజు విద్యావంతుడు. వైద్యుడు, ప్రజల నాడి తెలిసిన వైద్యుడుగా పలసాలో ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన ఎక్కడా గొడవలకు వెళ్లే వ్యక్తి కాదు. వివాదరహితుడు. సౌమ్యుడుగా పేరు ఉంది. కానీ ఇప్పుడు ఆయన మంత్రిగా ఉండటంతో ఆ దర్ఫంతో పోలీసు అధికారిపై దూర్భాషలాడుతూ దొరికిపోయారు. అక్కడి సీఐ ఏదైనా అవమానంగా మాట్లాడి ఉంటే మంత్రిగా ఆయన వెంటనే ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయాలి కానీ నేరుగా ఆయనే బూతులు లక్కించుకోవడం వివాదాస్పదం అయ్యింది. అక్కడ జరిగిన విషయానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి ఇరుకున పడ్డారు. ఆయనకు ఉన్న మంచి పేరు కాస్త ఈ ఘటనతో పోయింది.

Read More: YS Jagan: ఈ ఉగాదిని సీఎం జగన్ భారీగా ప్లాన్ చేస్తున్నారు.. కొత్త జిల్లాలు, కొత్త మంత్రులు.. కొత్త..!?

మంత్రి వ్యవహార శైలిలో మార్పు

పలసాలో ఆయన సొంత వర్గం కూడా ఈ మధ్య కాలంలో దూరం అవుతోందని వార్తలు వినబడుతున్నాయి. మంత్రి పదవి చేపట్టిన తరవాత ఆయన వ్యవహార శైలిలో మార్పు రావడంతో కొందరు దూరమైయ్యారట. ఈ ఘటన నేపథ్యంలో మంత్రి అలర్ట్ అయ్యారు. ప్రభుత్వం, పోలీసు శాఖ అలర్ట్ అయ్యింది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రవర్తిస్తున్న తీరును పోలీసులు చూస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు. పోలీసులపై నాయకులు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడిన సందర్భాల్లో ఇంతకు ముందులా వాటిని బయట రాకుండా చేయడం కుదరడం లేదు. క్షణాల్లో వాటికి సంబంధించిన ఆడియోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని కప్పిపుచ్చుకుని అంతర్గతంగా సరిచేసుకోవాలన్నా చేయిదాటి పోతున్నాయి.

ఘటనలపై అంతర్గతంగా విచారణ

విశాఖ శారదా పీఠం వద్ద ఈ ఘటన జరగడానికి ఒక రోజు ముందు నెల్లూరు జిల్లాలో మహిళా కానిస్టేబుళ్ల డ్రస్ కొలతలను పురుష టైలర్లు తీయడం, ఆ ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఇదే పోలీసు శాఖకు పెద్ద మచ్చగా మారింది. ఆ తరువాత రోజే పోలీసులకు మంత్రి మధ్య ఈ వివాదం జరిగింది. అక్కడ మంత్రి, ఆయన ఆనుచరులు అత్యుత్సాహంతో దుర్భాషలాడటం ప్రభుత్వాన్ని ఢిఫెన్స్ లో పడేసింది. ఈ ఘటనలపై పోలీసు శాఖ అంతర్గతంగా విచారణ జరుపుతోంది. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N