NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు..కొత్త పోలీస్ బాస్‌గా రాజేంద్రనాథ్ రెడ్డి..

Breaking: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎవరూ ఊహించని విధంగా సంచలన నిర్మణాలు తీసుకుంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా కీలక అధికారుల బదిలీలు జరగడం రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతోంది. సీఎంఓలో అన్ని తానే అయి చక్రం తిప్పిన ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ బదిలీ జరిగి 24 గంటలు కాకమునుపే ఏపి పోలీస్ బాస్ పైనా బదిలీ వేటు పడింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ మొదటి నుండి జగన్ కు అనుకూలంగానే ఉన్నారు. ఆయనను అకస్మాత్తుగా బదిలీ చేయడంపై ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీజీపీ సవాంగ్ ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ జీఏడీలో రిపోర్టు చేయాలని సవాంగ్ కు ప్రభుత్వం ఆదేశించింది.

Breaking: AP DGP Goutam Sawang transferred
Breaking: AP DGP Goutam Sawang transferred

Breaking: రెండేళ్లుగా సమర్ధవంతంగా బాధ్యతలు

డీజీపీగా గౌతమ్ సవాంగ్ గత రెండు సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అనేక అంశాల్లో ఏపి పోలీసులు అవార్డులు కూడా అందుకున్నారు. గౌతం సవాంగ్ బదిలీకి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అయితే ఈ నెల 3వ తేదీ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అవ్వడంపై సీఎం జగన్ సీరియస్ అయినట్లు సమాచారం. ఉద్యోగ సంఘాల చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పినప్పటికీ భారీ సంఖ్యలో ఉద్యోగులను పోలీసులు అనుమతించడంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై డీజీపీ సవాంగ్ జగన్ ను కలిసి వివరణ కూడా ఇచ్చారు.

Read More: YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం..సీఎంఒలో కీలక అధికారి బదిలీ..! ఎందుకంటే..?

 

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju