NewsOrbit
న్యూస్ సినిమా

Samantha: గుణశేఖర్ సమంతతో శాకుంతలం ఎలా తీస్తున్నారో బయటపడింది..!

Samantha: గుణశేఖర్ సమంతతో శాకుంతలం ఎలా తీస్తున్నారో తాజాగా రివీల్ అయింది. స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో టాలీవుడ్ అగ్ర దర్శకుడు గుణశేఖర్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో దేవ్ మోహన్ సమంత సరసన దుష్యంతుడి పాత్రలో నటించారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ భరతుడు పాత్ర ద్వారా బాల నటిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమవుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో నిర్మిస్తున్నారు. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు ఉన్న శకుంతల-దుష్యంత మహారాజుల ప్రేమ కథ ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను తెరమీదకు తీసుకురాబోతున్నారు.

It has come out how Gunasekhar is taking Shakuntalam with Samantha ..!
It has come out how Gunasekhar is taking Shakuntalam with Samantha ..!

కాగా, ఇప్పటికే శాకుంతలం మూవీ షూటింగ్ పూర్తవగా, దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక అంతక ముందు సమంత ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కూడా కొంత వరకు పూర్తి చేశారు. ఈ క్రమంలో రీసెంట్‌గా ‘శాకుంతలం’ సినిమాకి సంబంధించిన సమంత పాత్రను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫస్ట్ లుక్ అభిమానులతోపాటు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. గుణ టీమ్ వర్క్స్ – దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతకాలపై నీలిమ గుణ – దిల్ రాజు కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి భాణీలు అందిస్తున్నారు.

Samantha: 1966లో ఎన్ టీ రామారావు – సరోజా దేవి నటించిన ‘శకుంతల’ ఆధారం..!

కాగా శాకుంతలం మూవీని దర్శకుడు గుణశేఖర్ దేని ఆధారంగా రూపొందిస్తున్నారు..! అంటూ ప్రేక్షకులు ఇంటర్నెట్‌లో సర్చ్ చేయగా.. శతాబ్ధాల క్రితమే మహాకవి కాళిదాసు నాటకం ఆధారంగా ‘శకుంతల’ ఈ కథ తయారైందని తెలిసింది. దుష్యంత రాజుపై ఆమె ప్రేమ కథే శాకుంతలం చిత్రానికి మూల ఆధారం అట. ఇదే కథ ఆధారంగా 1966లో ఎన్ టీ రామారావు – సరోజా దేవి నటించిన ‘శకుంతల’ అనే తెలుగు చిత్రం..అలాగే 1941లోనే దిగ్గజ దర్శక, నటుడు శాంతారామ్ ఈ కథను సినిమాగా రూపొందించారు. ఇప్పుడు ఈ కథనే ప్రస్తుతం ఉన్న హై టెక్నికల్ వాల్యూస్‌తో ఎంతో గ్రాండియర్‌గా, అద్భుతమైన విజువల్ వండర్స్‌గా గుణశేఖర్ తయారు చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజయ్యాక ‘మోడ్రన్ శకుంతల’ అని చెప్పుకుంటారట. కాగా సమంత ఇప్పుడు యశోద అనే సినిమాలో నటిస్తున్నారు. అంతేకాదు తమిళంలో నయనతార, విజయ్ సేతుపతిలతో కలిసి నటించిన కథువాకుల రెండు కాదల్ చిత్రం కూడా రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Related posts

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri