Samantha: గుణశేఖర్ సమంతతో శాకుంతలం ఎలా తీస్తున్నారో తాజాగా రివీల్ అయింది. స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో టాలీవుడ్ అగ్ర దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో దేవ్ మోహన్ సమంత సరసన దుష్యంతుడి పాత్రలో నటించారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ భరతుడు పాత్ర ద్వారా బాల నటిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమవుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో నిర్మిస్తున్నారు. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు ఉన్న శకుంతల-దుష్యంత మహారాజుల ప్రేమ కథ ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను తెరమీదకు తీసుకురాబోతున్నారు.
కాగా, ఇప్పటికే శాకుంతలం మూవీ షూటింగ్ పూర్తవగా, దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక అంతక ముందు సమంత ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కూడా కొంత వరకు పూర్తి చేశారు. ఈ క్రమంలో రీసెంట్గా ‘శాకుంతలం’ సినిమాకి సంబంధించిన సమంత పాత్రను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫస్ట్ లుక్ అభిమానులతోపాటు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. గుణ టీమ్ వర్క్స్ – దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతకాలపై నీలిమ గుణ – దిల్ రాజు కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి భాణీలు అందిస్తున్నారు.
Samantha: 1966లో ఎన్ టీ రామారావు – సరోజా దేవి నటించిన ‘శకుంతల’ ఆధారం..!
కాగా శాకుంతలం మూవీని దర్శకుడు గుణశేఖర్ దేని ఆధారంగా రూపొందిస్తున్నారు..! అంటూ ప్రేక్షకులు ఇంటర్నెట్లో సర్చ్ చేయగా.. శతాబ్ధాల క్రితమే మహాకవి కాళిదాసు నాటకం ఆధారంగా ‘శకుంతల’ ఈ కథ తయారైందని తెలిసింది. దుష్యంత రాజుపై ఆమె ప్రేమ కథే శాకుంతలం చిత్రానికి మూల ఆధారం అట. ఇదే కథ ఆధారంగా 1966లో ఎన్ టీ రామారావు – సరోజా దేవి నటించిన ‘శకుంతల’ అనే తెలుగు చిత్రం..అలాగే 1941లోనే దిగ్గజ దర్శక, నటుడు శాంతారామ్ ఈ కథను సినిమాగా రూపొందించారు. ఇప్పుడు ఈ కథనే ప్రస్తుతం ఉన్న హై టెక్నికల్ వాల్యూస్‌తో ఎంతో గ్రాండియర్‌గా, అద్భుతమైన విజువల్ వండర్స్‌గా గుణశేఖర్ తయారు చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజయ్యాక ‘మోడ్రన్ శకుంతల’ అని చెప్పుకుంటారట. కాగా సమంత ఇప్పుడు యశోద అనే సినిమాలో నటిస్తున్నారు. అంతేకాదు తమిళంలో నయనతార, విజయ్ సేతుపతిలతో కలిసి నటించిన కథువాకుల రెండు కాదల్ చిత్రం కూడా రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!