NewsOrbit
న్యూస్

Karthika Deepam Mar 15 Today Episode: సీరియల్ నుంచి మోనిత కూడా అవుట్..!?

Karthika Deepam Mar 15 Today Episode:
కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ చాలా ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది. సీరియల్ లోని అన్ని క్యారెక్టర్స్ ను వరసపెట్టి తీసేస్తూ వస్తున్నారు ..ఒక పక్క కార్తీక్, దీపల పాత్రను ముగించిన దర్శకుడు ఇప్పుడు మోనిత పాత్రను కూడా ముగించేస్తున్నాడు అనే చెప్పాలి. కార్తీకదీపం అంటేనే కార్తీక్, దీప, మోనిత… వీరు ముగ్గురు లేకపోతే సీరియల్ ఏమయిపోతుందో ఏంటో అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందంటే…కారు ప్రమాదం నుండి బయటపడిన హిమని ఇంద్రుడు, చంద్రమ్మ దంపతులు కాపాడతారు.

Kartika Deepam: వంటలక్క చేసిన పనికి డాక్టర్ బాబు షాక్ … అసలు మ్యాటర్ ఏమిటంటే..?

Karthika Deepam Mar 15 Today Episode: హిమ మీద కోపాన్ని పెంచుకుంటున్న సౌర్య:

హిమ హైదరాబాద్ వెళ్తాను అంటే హిమను పంపించడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఇంద్రుడు, చంద్రమ్మ దొంగతనం చేసి డబ్బు సంపాదిస్తారు. ఇక హైదరాబాద్‌లో ఉన్న సౌర్య మాత్రం హిమ ఎక్కడో చోట బతికే ఉంటుందని గట్టిగా నమ్ముతుంది..అమ్మా నాన్నలను చంపిన హిమ మీద ఎలాగయినా పగ తీర్చుకుంటా అంటూ కోపంతో రగిలిపోతుంది.

Karthika Deepam Mar 14 Today Episode: సౌర్య చేతి మీద ఉన్న హిమ పేరును తొలగించే పనిలో పడ్డ సౌర్య…!!పచ్చబొట్టు పోతుందా మరి..?
దీప,కార్తీక్ లకు పిండ ప్రధానం చేస్తున్న సౌందర్య దంపతులు :

మరోవైపు కార్తీక్, దీప, హిమలకు నది దగ్గర ఆనందరావు, సౌందర్యలు కుటుంబ సభ్యులతో కలిసి పిండప్రదానం చేస్తుంటారు. మరో చోట మోనిత తెల్లచీర కట్టుకుని బాబును ఒళ్ళో కూర్చోబెట్టుకుని కార్తీక్ ఫొటో ముందు కూర్చుని.. ‘బిడ్డని ఇస్తే అన్నీ వదిలేస్తాను అన్నాను.. బిడ్డని ఇచ్చావ్.. నేను దూరం కానని తెలిసే ఇలా చావుతో శాశ్వతంగా దూరమైపోయావా కార్తీక్ అంటూ మనసులోనే కుమిలిపోతుంది మోనిత.ఇక పిండాలను చెరువులో వదిలిపెట్టి వచ్చిన సౌందర్య, ఆనందరావులు బాగా ఏడుస్తారు.ఇక పిండప్రదానం సమయంలో కూడా సౌర్య హిమ ఫొటోనే కోపంగా చూస్తూ ఉంటుంది.

పాపం మోనిత..బిడ్డను, ఆస్తిని ఇచ్చేసి ఒంటరి అయిపోయిందిగా:

సీన్ కట్ చేస్తే మోనిత బాబుని తీసుకుని బస్తీలోని ఇంటికి వచ్చి కార్తీక్ జ్ఞాపకాలతోనే కార్తీక్ ఫొటో ముందు నిలబడి చాలా ఏడుస్తుంది. అక్కడే ఉన్న లక్ష్మణ్‌, అరుణలను చూస్తూ చిన్న తప్పు చేస్తేనే నా కార్తీక్ ఆస్తి రాసి ఇచ్చాడు.నేను చాలా పెద్ద పెద్ద తప్పులే చేశాను లక్ష్మణ్. నా భర్త నడిచిన అదే దారిలో నేనూ నడవాలనుకుంటున్నాను. అందుకే నీకు నా ఆస్తి రాసిస్తున్నాను’ అంటూ కొన్ని. పేపర్స్ లక్ష్మణ్‌కి చేతిలో పెడుతుంది. ‘అమ్మా’ ఏంటిది అంటాడు..ఇందులో కూడా నా స్వార్థం ఉంది లక్ష్మణ్ ఈ ఆస్తి తీసుకుని నా బిడ్డని మీరే పెంచి వీడ్ని డాక్టర్‌ని చెయ్యండి అంటుంది.మీరు దూరంగా వెళ్లి నా బిడ్డని పెంచండి అంటుంది మోనిత. ‘మీరు ఎక్కడికని వెళ్తారమ్మా’ అంటాడు లక్ష్మణ్ బాధగా ‘నడవడం మొదలుపెడితే ప్రపంచం మన అడుగంత చిన్నది అంటూ ఎక్కడికో అక్కడికి వెళ్తాను అంటుంది. ఆ సీన్ కాస్త చూడడానికి ఎమోషనల్ గా ఉంటుంది.అలాగే ఒక్కటి మాత్రం గుర్తించుకోండి..

ఇంటి తలుపులు తీసే ఉంచాలని మోనిత ఎందుకు అంది :

ఈ ఇంటి తలుపులు మాత్రం ఎప్పుడూ తెరిచే ఉండాలి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా పెట్టే ఒక మనిషిని చి చుడండి అంటుంది మోనిత. ‘మీరు లేకుండా తలుపులు తెరిచి పెట్టడం ఎందుకమ్మా’ అంటుంది అరుణ. నా కార్తీక్ బతికి ఉన్నప్పుడు నా కోసం ఈ రాలేదు కనీసం నేను లేని సమయంలో అయినా నా కార్తీక్ ఆత్మైనా వచ్చి నా ప్రేమని గుర్తు చేసుకుని బాధపడితే నాకు అదే చాలు అంటూ బిడ్డని తీసుకో అరుణా’ అంటుంది మోనిత.ఇంతలో అరుణ అమ్మా ఈ బిడ్డను కార్తీక్ బాబు జ్ఞాపకంగా మీరే ఉంచుకోండమ్మా’ అంటుంది ‘వద్దు వద్దు.. మొయ్యలేనన్ని జ్ఞాపకాలు నాతోనే ఉన్నాయి.. వీడు నాతో ఉంటే వీడ్ని చూసినప్పుడల్లా కార్తీక్ గుర్తుకొస్తూనే ఉంటాడు.. అది నాకు ఇష్టం లేదు అని బస్తిలో మాత్రం వీడిని ఉంచకండి. మీకు కావాల్సినంత ఆస్తి ఇచ్చాను. జాగ్రత్తగా వాడుకుని, అంతే జాగ్రత్తగా నా బిడ్డని పెంచండి’ అంటూ చేతిలో ఉన్న ఆనంద్‌ని గుండెలకు హత్తుకుని పాపం. బాగా ఏడుస్తుంది మోనిత. ఆ సీన్ చూడడానికి చాలా బాధాకరంగా ఉంటుంది.

సౌందర్య ఇంటికి హిమ…మరోపక్క హిమ ఫోటోను బయటపారేసిన సౌర్య :

అరుణకు బాబుని ఇచ్చి ఇంటిని మరోసారి చూసుకుని బాధగా అక్కడ నుంచి ఒట్టి చేతులతో వెళ్లిపోతుంది మోనిత.ఇక సౌందర్య వాళ్ళు దీప వాళ్ళని తలుచుకుని బాధపడుతున్న సమయంలో హిమ సంతోషంగా పరుగులు పెడుతూ ఇంటి గుమ్మం దగ్గరకు వస్తుంది. సరిగ్గా అప్పుడే సౌర్య ఆవేశంగా.. ‘అమ్మా నాన్నల పక్కన దాని ఫొటో ఎందుకు?’ అంటూ హిమ ఫొటో తీసి బయటకి విసిరేస్తుంది. సరిగ్గా ఆ ఫొటో ఇంట్లోకి రాబోతున్న హిమ కాళ్ల ముందు పడుతుంది.అది చూసి హిమ షాక్ అవుతుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?