NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీలో గందరగోళం ..నలుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పదవ రోజైన మంగళవారం ప్రశ్నోత్తరాలు ప్రారంభం అయిన వెంటనే టీడీపీ సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. ఫైబర్ గ్రిడ్ అవినీతిపై సభ్యుల ప్రశ్నకు మంత్రి బాలినేని బాలినేని శ్రీనివాసరెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు గొడవ చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ నలుగురు టీడీపీ సభ్యులపై ఈ నెల 25వ తేదీ వరకూ సస్పెన్షన్ వేటు వేశారు. టీడీపీ సభ్యులు బి అశోక్, రామరాజు, అనగాని సత్యప్రసాద్, వెలగపూడి రామకృష్ణ బాబులను సస్పెండ్ చేశారు.

AP Assembly Budget Session four tdp mlas suspension
AP Assembly Budget Session four tdp mlas suspension

AP Assembly Budget Session: ఫైబర్ గ్రిడ్ అవినీతిపై సీఐడీ విచారణ జరుగుతోంది

ఫైబర్ గ్రిడ్ టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయని, నిబంధనలు పాటించకుండా నాటి టీడీపీ ప్రభుత్వం టెర్రాస్ కంపెనీకి ఫైబర్ గ్రిడ్ అప్పగించారని వైసీపీ సభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. మంత్రి చెప్పాల్సిన సమాధానాన్ని కూడా సభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్ తన ప్రసంగంలో చెప్పడంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ సమాధానంలో మంత్రి ఇవన్నీ చెబుతారు అంటూ వారించారు. టెరాసాఫ్ట్ కంపెనీ చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడికి చెందినదని, బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపెనీకి టెండర్లు ఇచ్చారని మంత్రి బాలినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఫైబర్ గ్రిడ్ లో జరిగిన లోపాలను వివరించిన మంత్రి బాలినేని.. దీనిపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిందన్నారు. విచారణ వేగవంతంగా జరుగుతోందని,  దీనిలో ఎంత పెద్ద వారున్నా వదిలిపెట్టేది లేదని కశ్చితంగా వారికి శిక్ష పడుతుందని మంత్రి బాలినేని పేర్కొన్నారు.

 

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju