NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

Imran Khan: పాక్ క్యాబినెట్ సెక్రటరీ కీలక ప్రకటన ..ఇమ్రాన్ కు ఊహించని షాక్

Imran Khan: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూచనల మేరకు అధ్యక్షుడు అరిఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇది జరిగిన కొద్ది గంటల వ్యవధిలో ఇమ్రాన్ ఖాన్ కు ఆ దేశ క్యాబినెట్ సెక్రెటరీ నుండి ఊహించని షాక్ తగిలింది. ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ఇమ్రాన్ ఖాన్ ను తొలగించినట్లు కేబినెట్ సెక్రటరీ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ఇకపై ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కాదనీ, దేశంలోని బ్యూరోక్రసీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నడుస్తుందని క్యాబినెట్ సెక్రటరీ ప్రకటనలో తెలిపింది. పాకిస్థాన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిపి ప్రధాని పదవి నుండి ఆయనను తొలగిస్తారని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ ఖాసిం సూరి అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారు. ఈ తరుణంలో ఇమ్రాన్ ఖాన్ తన రాజకీయ చతురతతో సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి విపక్షాలకు షాక్ ఇచ్చారు. ప్రజలందరూ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. సభ రద్దుకు సిఫార్సు చేస్తూ దేశ అధ్యక్షుడికి లేఖ రాసినట్లు చెప్పారు. ప్రధాని ఇమ్రాన్ సూచనల మేరకు అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ మంత్రి హబీబ్ ప్రకటించారు.

Pak cabinet secretary key orders on Imran Khan
Pak cabinet secretary key orders on Imran Khan

Imran Khan: ‘ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి కాదు’

ఈ పరిణామం జరిగిన కొద్ది గంటల వ్యవధిలో ఇమ్రాన్ ఖాన్ కు షాక్ ఇచ్చేలా క్యాబినెట్ సెక్రటరీ నుండి ప్రకటన విడుదల అయ్యింది. అధికారికంగా ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ఇమ్రాన్ ఖాన్ ను తొలగించినట్లు క్యాబినెట్ ప్రకటన విడుదల చేసింది. జాతీయ అసెంబ్లీని రద్దు చేసినట్లు కొన్ని గంటల్లో ఇలాంటి ప్రకటన రావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 48(1), ఆర్టికల్ 58(1) ప్రకారం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్యాబినెట్ సెక్రటరీ పేర్కొంది. ఇకపై ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి కాదని, దేశంలోని బ్యూరోక్రసీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నడుస్తోందని క్యాబినెట్ సెక్రటరీ ప్రకటనలో స్పష్టం చేసింది.మరో వైపు 195 మంది సభ్యుల మద్దతుతో పిఎంఎల్ఎన్ నేత షెహబాజ్ షరీఫ్ ను ప్రధానిగా ప్రతిపక్షం ప్రకటించింది. అంతకు ముందు అయాజ్ సిద్ధిఖిని జాతీయ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నుకోగా డిప్యూటి స్పీకర్ ఖాసిమ్ సూరీ దీన్ని తిరస్కరించారు. ప్రభుత్వ రద్దుపై అన్ని వ్యవస్థలను ఆశ్రయిస్తామని విపక్షాలు తెలిపాయి.

పాక్ సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్వా ఉత్కంఠ

మరో పక్క జాతీయ అసెంబ్లీ రద్దు నిర్ణయంపై విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు అత్యవసర విచారణకు స్వీకరించింది. ప్రస్తుత రాజకీయ సంక్షోభంపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దేశంలో శాంతి భద్రతల విషయం సైన్యం చూసుకోవాలని కోరింది. అన్ని రాజకీయ పక్షాలు రాజ్యాంగాన్ని అనుసరించాలని సూచిస్తూ నోటీసులు జారీ చేసింది. జాతీయ అసెంబ్లీ రద్దుకు సంబంధించి ప్రధాని, రాష్ట్రపతి తీసుకున్న ఆదేశాలు, తదుపరి చర్యలపై పాక్ సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్వా ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉండగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ బాబర్ ఇప్తిఖార్ పేర్కొన్నారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?