NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Balineni Srinivasa Reddy: సీఎం జగన్ తో ముగిసిన బాలినేని భేటీ .. రాజీనామా ఊహాగానాలను ఖండించిన బాలినేని

Balineni Srinivasa Reddy: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. కొత్త మంత్రి వర్గంలో బాలినేని పేరు లేకపోవడంతో ఆయన మనస్థాపానికి గురైయ్యారనీ, రాజీనామాకు సిద్ధమయ్యారంటూ మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రెండు మూడు పర్యాయాలు ఆయనతో సమావేశమైయ్యారు. మరో పక్క ఒంగోలులో బాలినేని అనుచరులు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో జగన్ ఆదేశాల మరేకు సోమవారం సాయంత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి పలువురు నేతలతో కలిసి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుని భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా జగన్ తో సమావేశమైయ్యారు. అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడారు. తాము వైఎస్ఆర్ కుటుంబానికి, జగన్ కు విధేయులమని చెప్పారు.

Balineni Srinivasa Reddy met cm ys jagan
 Balineni Srinivasa Reddy met cm ys jagan

 

రాజీనామా చేస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను బాలినేని ఖండించారు. పార్టీ యే బాధ్యతలు అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు 70 శాతం మంత్రి పదవులు ఇచ్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ సీపీ అని చెప్పారు. తనకు ఎటువంటి అసంతృప్తి లేదని, తమది అంతా ఒక కుటుంబం అని చెప్పుకొచ్చారు. సజ్జల తనతో బేటీలపై వివరణ ఇస్తూ వారంలో ఒకటి రెండు సార్లు కలుస్తూనే ఉంటామని, అలానే తన నివాసానికి సజ్జల వచ్చారు తప్ప మరేమి లేదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో గతంలో వచ్చిన సీట్లకు మించి వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. ఆదిమూలపు సురేష్ తో తనకు ఎటువంటి విభేదాలు లేవని కలిసి పని చేశామన్నారు. ఈ నెల 22వ తేదీన ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఉందని దానిపై చర్చించినట్లు బాలినేని వెల్లడించారు.

 

ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్ ను మంత్రివర్గంలో కొనసాగిస్తూ బాలినేని తప్పించడంపై ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఒంగోలులో నిన్న రాత్రి సీఎం దిష్టిబొమ్మను దగ్ధం కూడా చేశారు. పార్టీ కార్యాలయం వద్ద జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నారు. ఈ తరుణంలోనే బాలినేని అసంతృప్తితో ఉన్నారనీ, మనస్థాపానికి గురై రాజీనామాకు సిద్ధపడ్డారంటూ వార్తలు వచ్చాయి. సీఎంతో భేటీ అనంతరం టీకప్పులో తుఫానులా వివాదం సద్దుమణిగింది.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N