Prabhas – Yash: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో ఇప్పుడు కన్నడ రాకింగ్ స్టార్ యష్ సమానం అంటూ కన్నడ మీడియాలోనూ అలాగే సోషల్ మీడియాలోనూ వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం కేజీఎఫ్ సిరీస్. బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్‌గా ఏ రేంజ్‌కు చేరుకున్నాడో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ సినిమాలను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలుగా తీసుకువచ్చాడు. వీటి ఫలితం ఎలా ప్రభాస్ రేంజ్ మాత్రం తగ్గలేదనే చెప్పాలి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇప్పుడు ప్రభాస్ హీరోగా పాన్ వరల్డ్ రేంజ్ సినిమాలు రూపొందుతున్నాయి. బాలీవుడ్ స్ట్రైట్ మూవీ ఆదిపురుష్ ఇప్పటికే షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుం టోంది. ఆదిపురుష్ సౌత్‌లోని అన్ని భాషలతో పాటు బాలీవుడ్ అలాగే, హాలీవుడ్లో కూడా ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ప్రభాస్ ఇందులో రాముడిగా నటిస్తున్నారు. పలువురు బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక వైజయంతీ మూవీస్ 50వ సినిమాగా ప్రభాస్‌తో ప్రాజెక్ట్ అనే పాన్ వరల్డ్ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Prabhas – Yash: ఏ రకంగా ప్రభాస్‌తో యష్ ఈక్వల్ అని చెప్పుకుంటున్నారో..?
ఈ సినిమాలో అమితాబ్, దీపిక పదుకొణె ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే, వరుసగా పాన్ ఇండియా సినిమాలూ ఉన్నాయి. అయితే, కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన యష్ భారీ హిట్ అందుకున్నాడు. పాన్ ఇండియా రేంజ్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్ఠిస్తోంది. కానీ, దీని తర్వాత యష్ ఏ ఏ ప్రాజెక్ట్స్‌లో చేస్తున్నాడో క్లారిటీ లేదు. మళ్ళీ కేజీఎఫ్ సీక్వెల్ ఉందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కానీ, అదెప్పుడో ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. ప్రాజెక్ట్స్ పరం గా చూస్తే ప్రభాస్ కంటే ఎక్కువ సినిమాలేవీ యష్ చేతిలో లేవు. మరి ఏ రకంగా ప్రభాస్‌తో యష్ ఈక్వల్ అని చెప్పుకుంటున్నారో అర్థం కావడం లేదని నెటిజన్స్ సందేహాలను వ్యక్త చేస్తున్నారు.