5th ఎస్టేట్ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Prashant Kishor: పీకే స్కెచ్ ఆ రాష్ట్రాలపైనే.. ! 370 సీట్లు సాధ్యమా..?

Share

Prashant Kishor:  ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. అందుకు సంబంధించి తెరవెనుక పనులు చకచెకా పూర్తి చేసుకుంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే ప్రశాంత్ కిషోర్ ఏకైక లక్ష్యం. అందులో భాగంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒక మాలగా గుచ్చి ఆ మాలను తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ మెడలో వేయడమే ప్రశాంత్ కిషోర్ ప్లాన్ గా కనబడుతోంది. అందుకు ఒక్కో ప్రాంతీయ పార్టీతో డీల్ లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్ తో చర్చలు జరిపారు. కేసిఆర్ తోనూ ఒప్పందాలు చేసుకున్నారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా ఉన్నప్పటికీ ఆయనపై ఉన్న ఒత్తిళ్ల కారణంగా బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడుతున్న కూటమిలో జాయిన్ అయ్యే అవకాశాలు లేవు. కేసిఆర్ థర్డ్ ఫ్రంట్ అంటున్నప్పటికీ చివరికి కాంగ్రెస్ పార్టీతో కలవాల్సిందే. శరద్ పవార్, మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్దవ్ థాకరే, అరవింద్ కేజ్రీవాల్ లు కలిస్తే ఒక బలమైన కూటమిగా ఫామ్ అవ్వడం ఖాయం. చంద్రబాబుకు ప్రస్తుతం బలం లేకపోవడం, ఆయన రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టడంతో కేంద్ర రాజకీయాలకు ఆయనను పక్కన బెట్టారు.

Prashant Kishor strategy on 2024 election
Prashant Kishor strategy on 2024 election

Read More: Prasanth Kishore: అందర్నీ కలిపేసి.. ప్రధానిని డిసైడ్ చేసేసి.. దేశాన్ని ఏలేసి.. వామ్మో..  పీకే అతి పెద్ద ప్లాన్..!!

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ లక్ష్యాలన చేరుకోగలరా..?

అసలు ప్రశాంత్ కిషోర్ తను అనుకుంటున్న లక్ష్యాన్ని చేరుకోగలరా..? లేదా..?  ఒక్క కాంగ్రెస్ పార్టీకి అయితే మ్యాజిక్ ఫిగర్ రాదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలకు ఎంపీ సీట్లను గెలిపించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అత్యధిక స్థానాలు గెలిపించడమే ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహం. ప్రతిపక్ష పార్టీలన్నింటికీ కలిపి 200 స్థానాలు గెలిచి, కాంగ్రెస్ పార్టీ 150 స్థానాలు సాధిస్తే బీజేపీ వ్యతిరేక కూటమి అధికారంలోకి రావడం సాధ్యం అవుతుంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సింగిల్ గా 150 స్థానాలు రావడమే చాలా కష్టం. ప్రశాంత్ కిషోర్ కు ఉన్న అవకాశాలను ఒక సారి పరిశీలిస్తే … ఆంధ్రప్రదేశ్ లో 25 స్థానాలు ఉండగా, వైసీపీ, టీడీపీ సగం సగం పంచుకుంటాయి. ఈ రెండు పార్టీల్లో ఒక పార్టీ ప్రశాంత్ కిషోర్ కు అంగీకారం తెలిపే అవకాశం ఉంటుంది. అస్సాంలో 14 పార్లమెంట్ స్థానాలు ఉండగా అక్కడ బీజేపీకే అవకాశం ఉంది. దాదాపు 10 బీజేపీకి వస్తే ఇతర పార్టీలకు కేవలం నాలుగు స్థానాలు వచ్చే అవకాశం ఉంది. బీహార్ లో 40 స్థానాలకు గానూ బీజేపీ, జేడియుకి కలిపి 25 – 30 స్థానాలు వస్తే ఆర్ జే డీ ఇతర బీజేపీ వ్యతిరేక కూటమికి 10 – 12 స్థానాలు వస్తాయి. గుజరాత్ లో 26 స్థానాలు ఉండగా ఈ రాష్ట్రంలో బీజేపీ చాలా బలంగా ఉంది. కావున కేవలం మూడు నాలుగు స్థానాలు మాత్రమే బీజేపీ వ్యతిరేక కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది.

ఆ రాష్ట్రాల మీద ఎక్కువ ఫోకస్

కర్ణాటకలో 28 స్థానాలు ఉండగా 20 సీట్లు బీజేపీ గెలుచుకునే ఛాన్స్ ఉంది. 8 వరకూ బీజేపీ వ్యతిరేక కూటమికి వస్తాయి. కేరళలో 20 స్థానాలు ఉండగా బీజేపీ మిత్ర పక్షాలు అయిదు స్థానాలు గెలిస్తే మిగిలినవి బీజేపీ వ్యతిరేక కూటమికి ఛాన్స్ ఉంది. మధ్యప్రదేశ్ లో 29 స్థానాలకు 15 సీట్లు బీజేపీ వ్యతిరేక కూటమి సాధించే అవకాశం ఉంటుంది. మహారాష్ట్ర లో 48 స్థానాలు ఉండగా, సగం బీజేపీకి వెళ్లినా మిగిలినవి శివసేన, శరద్ పవార్, కాంగ్రెస్ కూటమిలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇలా అన్ని రాష్ట్రాలను చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ అనుకుంటున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ద్వారానే సాధ్యం అవుతుంది. ఈ రాష్ట్రాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా కొంత అవకాశం ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లో 78 స్థానాలు ఉండగా 25 స్థానాలు బీజేపీ వ్యతిరేక కూటమి గెలుచుకున్నా వీళ్లు అనుకున్న లెక్క వస్తుంది. ఇది సాధించాలంటే ఇప్పటి నుండి చాలా ప్లానింగ్ తో ముందుకు సాగాల్సి ఉంటుంది. పీకే వద్ద అటువంటి స్ట్రాటజీలు చాలా ఉంటాయి. సో..ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.


Share

Related posts

BREAKING: cheating case హీరో ఆర్యకు ఊరట..?

amrutha

Viral Video : చిరుతపై చిరుతలా మారాడు..! పులిపైకె పులి పంజా విసిరాడు..!! ఈ వీరుడి పోరాటం దేశం మొత్తం తెలుసుకోవాల్సిందే..!!

bharani jella

ఆ ప్రాంతాలలో ఒక్కసారిగా పెరిగి పోయిన వైసీపీ గ్రాఫ్..!!

sekhar