NewsOrbit
రాజ‌కీయాలు

Prashant Kishor: పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో తెలంగాణాలో రేవంత్ రెడ్డికి లైన్ క్లియర్ చేసిన ప్రశాంత్ కిషోర్..!!

Prashant Kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపాక దేశ రాజకీయ ముఖచిత్రం మారుతోంది. ముఖ్యంగా దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా.. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూర్చుని ప్రశాంత్ కిషోర్ చేస్తున్న రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ రాణించాలంటే కచ్చితంగా ఏపీలో వైఎస్ జగన్ తో పొత్తు పెట్టుకోవాలని.. సోనియా గాంధీకి తెలియజేసినట్లు సమాచారం. ఇదే సమయంలో తెలంగాణ లో రాణించాలంటే… ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని… సింగల్ గానే వెళ్తే తిరుగుండదని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సోనియాకి ప్రశాంత్ కిషోర్ వివరించారట. దీంతో ఇక తెలంగాణలో కాంగ్రెస్ పొత్తులకు వెళ్లకుండా ఎన్నికలకు వెళితే మాత్రం ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బిగ్ ప్లస్ పాయింట్ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎందుకంటే మొదటి నుండి రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ తో ముఖ్యంగా కేసీఆర్ తో.. రేవంత్ రెడ్డి నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సొంత పార్టీలో కొంత మంది సీనియర్లు .. అడ్డుపడుతున్న గాని రేవంత్ రెడ్డి.. ఒకపక్క సొంత పార్టీ నేతలను ఎదుర్కొంటూ మరోపక్క అధికార పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. పాలనాపరంగా టిఆర్ఎస్ వైఫల్యం చెందిన ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కేసీఆర్ ని మెయిన్ టార్గెట్ చేసుకుని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ పదవి చేపట్టాక ..సరైన ప్రతిపక్ష పాత్ర పోషించే రీతిలో క్యాడర్ ని నడిపిస్తున్నారు. అయితే గత కొంత కాలం నుండి టిఆర్ఎస్ తో కాంగ్రెస్ పోత్తు అనే టాక్ తెలంగాణా రాజకీయాలలో బలంగా వినిపిస్తోంది. అయితే తాజాగా మాత్రం తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే భవిష్యత్తు ఉంటుందని సోనియాకి పీకే చెప్పటం .. ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.Revanth Reddy quits as Telangana Congress working president, second in daysఇదే జరిగితే ఇంకా టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు అవుతుందని పొలిటికల్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ మరింత దూకుడుగా రాజకీయం చేస్తే.. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని పేర్కొంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా గాని కాంగ్రెస్ ఆ క్రెడిట్.. సొంతం చేసుకోవడంలో వైఫల్యం చెందింది. ఈ తరుణంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్ఎస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఇటువంటి తరుణంలో … దేశంలోని ధనిక రాష్ట్రామని గొప్పగా చెప్పుకొనే సీఎం కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేకపోవడంతో పాటు అప్పులు కోసం వేచి చూసే పరిస్థితి దాపురించింది. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో… ఉన్న ప్రతిపక్షాలు ఇదే సరైన సమయమని భావిస్తున్నాయి. ఈ విషయంలో బిజెపి అందరికంటే ముందుంది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆల్ రెడీ  పాదయాత్ర కూడా స్టార్ట్ చేసేశారు. ఇంకా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి ఉండటంతో రేవంత్  కూడా.. రాజకీయంగా మరింత దూకుడు పెంచితే… అధికార పార్టీ టిఆర్ఎస్ డిఫెన్స్ లో పడటం గ్యారెంటీ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?