NewsOrbit
రాజ‌కీయాలు

KTR Roja: సీఎం కేసీఆర్ తో భేటీ తర్వాత కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చిన రోజా..!!

KTR Roja: మంత్రి కేటీఆర్ నిన్న ఓ కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీస మౌలిక సదుపాయాలు లేవని సంచలన వ్యాఖ్యలు చేశారు. నీరు, కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని అన్నారు. దీంతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే మంత్రి రోజా నిన్ననే తెలంగాణ ముఖ్యమంత్రి ని ప్రగతి భవన్ లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడే సోషల్ మీడియా లో చూశాను ఎవరో ఆయన్ని తప్పుదోవ పట్టించారని వెల్లడించారు.

after kcr meeting minister roja counter to ktr

 

రాజకీయాల్లో ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా అనేకమందికి స్ఫూర్తిదాయకంగా ఉన్న కేటీఆర్ నీ అందరం గుర్తిస్తాం. అటువంటి కేటీఆర్ నీ ఏపీ గురించి అలా మాట్లాడుతారు అని నేను అనుకోను. అయినా ఆయన చేసిన వ్యాఖ్యలలో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ అనే పదం కూడా ఎక్కడా వాడలేదు. పొరుగు రాష్ట్రాలు అనే మాట వాడారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన అలా అని ఉంటే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను. పర్యాటక శాఖ మంత్రిగా నేను కేటీఆర్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా జగన్ అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు స్వయంగా మంత్రి కేటీఆర్ కి నేను దగ్గరుండి చూపిస్తాను. అవసరమైతే ఏపీ పరిస్థితులపై కేటీఆర్ కి వివరించిన అతని ఫ్రెండ్ కి కూడా తీసుకొస్తే చూపిస్తాను. రాష్ట్రంలో పాఠశాలలు ఆసుపత్రులు, రహదారులు ఏరకంగా ఉన్నాయో చూపిస్తాను. అవినీతికి తావు లేకుండా జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలను పొరుగు రాష్ట్రం తమిళనాడు కూడా అనుసరించే పరిస్థితిలో ఉంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందేలా సీఎం జగన్ పాలన ఇస్తున్నారు.

after kcr meeting minister roja counter to ktr

 

ఇటువంటి కార్యక్రమాలు పథకాలు చూపిస్తే కేటీఆర్ తప్పక తెలంగాణాలో ఈ కార్యక్రమాలు ప్రవేశ పెట్టాలని అనుకుంటారు. ఇదే సమయంలో అతని ఫ్రెండ్ చెప్పింది తప్పని ఖచ్చితంగా కేటీఆర్ తెలుసుకుంటారని భావిస్తున్నాను. మరి కేటీఆర్ ఎప్పుడు ఆంధ్రాకి వస్తారో డేట్ ఇస్తే బాగుంటుంది. టైం చెప్తే వెయిట్ చేస్తాను. పర్యాటక శాఖ మంత్రిగా ఆయనకు స్వాగతం పలికి.. రాష్ట్రం మొత్తం చూపిస్తాను. కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా ముఖ్యంగా పార్టీలకు అతీతంగా జగన్ అందిస్తున్న పాలనా స్వయంగా దగ్గరుండి కేటీఆర్ కి చూపిస్తా అని రోజా స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో దేశంలో దాదాపు 16 రాష్ట్రాల్లో తెలంగాణ తో సహా కరెంటు కోతలు ఉన్నాయని తెలిపారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి ఇష్టానుసారంగా మాట్లాడితే ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని కేటీఆర్ గుర్తించాలని మంత్రి రోజా తెలిపారు.

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju