NewsOrbit
సినిమా

Liger: విజ‌య్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. `లైగర్` హంట్ థీమ్ అదుర్స్ అంతే!

Liger: రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2011లోనే సినీ గ‌డ‌ప తొక్కిన విజ‌య్‌.. 2016లో వ‌చ్చిన `పెళ్ళిచూపులు`తో హీరోగా మారాడు. ఈ సినిమా ప్రేక్ష‌కులను బాగానే అల‌రించి ఆ త‌ర్వాత `అర్జున్ రెడ్డి`తో మాస్ హీరో మెంట‌లెక్కించిన రౌడీ.. `గీత గోవిందం` క్లాస్ హీరోగా ప్రేక్ష‌కుల‌ను మిస్మ‌రైజ్ చేశారు.

ఇక ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ చేతిలో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో `లైగ‌ర్‌` ఒక‌టి. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై హై బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఇందులో అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టించింది.

బాక్సింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ ఆగ‌స్టులో విడుద‌ల కానుంది. అయితే నేడు విజ‌య్ బ‌ర్త్‌డే కావ‌డంతో.. లైగ‌ర్ టీమ్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. `ఇవాళ మా లైగర్ జన్మించాడు. అతను అడవికి రాజుగా ఉండటానికి వేటగాడుగా జన్మించాడు. ఈరోజు హంట్ థీమ్ తో మా పాన్ ఇండియన్ వేటను ప్రారంభిస్తాము` అంటూ లైగర్ హంట్ థీమ్ లిరికల్ వీడియోను మేక‌ర్స్ కొద్ది సేప‌టి క్రీత‌మే బ‌య‌ట‌కు వ‌దిలారు.

మచంద్ర ఆలపించిన ఈ పాట‌కు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించాడు. బాలీవుడ్ కంపోజర్ విక్రమ్ సంగీతాన్ని అందించాడు. ఈ స్పెషల్ థీమ్ సాంగ్ హీరో క్యారక్టర్ మరియు అతని యాటిట్యూడ్ ని ప్ర‌జెంట్ చేశారు. మొత్తానికి ఈ హింట్ థీమ్ చూసిన నెటిజ‌న్లు అదుర్స్ అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri