NewsOrbit
జాతీయం న్యూస్

Breaking: సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ

Breaking: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తొంది. కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం వరకూ కొత్తగా 3,712 మంది కరోనా బారినపడ్డారు. ఒక్క రోజే అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, కేరళ నుండి అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కోవిడ్ నియమాలు ఎక్కువ మంది పాటించడం లేదు. మాస్కులు ధరించడం లేదు. ఈ నేపథ్యంలో మరల కరోనా కేసులు విజృంభిస్తుండటంతో ఆందోళన కల్గిస్తొంది. మహారాష్ట్రలో నిన్న మొన్నటి వరకూ స్థిరంగా కేసులు నమోదు అవుతుండగా, బుధవారం ఒక్కరోజే 1081 కేసులు నమోదు అయ్యాయి. గత మూడు నెలల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 19,509 యాక్టివ్ కేసులు ఉండగా, పాజిటివిటీ రేటు 8.4 శాతానికి పెరిగింది. క్రియాశీల రేటు 0.05 శాతంగా, రికవరీ రేటు 98.74 శాతంగా ఉన్నాయి.

Breaking AICC Chief Sonia Gandhi Tests covid Positive
Breaking AICC Chief Sonia Gandhi Tests covid Positive

Breaking:హోమ్ ఐసోలేషన్ లో సోనియా గాంధీ

పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనబడటంతో ఆమె పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తొంది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సోనియా హోం ఐసోలేషన్ లో ఉన్నారు. గతంలోనే సోనియా గాంధీ కోవిడ్ వ్యాక్సిన్ డోస్ లు రెండు వేయించుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేయడంతో ఈ నెల 8వ తేదీన విచారణకు హాజరుకావాల్సి ఉండగా కరోనా సోకడం గమనార్హం. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేత కేసి వేణుగోపాల్ కు కూడా కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పలువురు నేతలు సమావేశమైయ్యారు. సోనియా గాందీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నేపథ్యంలో గత వారం రోజులుగా ఆమెతో సమావేశమైన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju