Venkatesh:టాలీవుడ్ కూలెస్ట్ స్టార్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది విక్టరీ వెంకటేష్. అవును.. రెండు మూడు దశాబ్దాలుగా వెంకిమామ తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవను కొనియాడలేము. ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు స్టార్ట్ చేసిన మొదటి హీరోగా ఇతగాడిని చెప్పుకోవచ్చు. ఇతనిలో మరో గొప్ప విషయం ఏమంటే ఏ సినిమా స్టార్ అభిమానులైనా ఈ సినిమాలను ఆరాధిస్తారు. వెంకీ అంటేనే ఫామిలీ సినిమాలకు పెట్టింది పేరు. మనోడి సినిమా రిలీజయ్యిందంటే ఇంటిల్లిపాది కూడా థియేటర్ కి వెళ్లే సాహసం చేస్తుంటారు. ఎందుకో వేరే ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రానాతో వెంకీ మామ:
ఇక చాలా రోజులుగా తన అన్నయ్య కొడుకు అయినటువంటి రానా దగ్గుబాటితో కూడా ఓ సినిమా చేయాలని ఎదురుచూస్తూ ఉన్నాడు మన వెంకిమామ. మొత్తానికి ఈనాటికి ‘రానానాయుడు’ అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా వారు కలిసి పని చేసే అవకాశం దొరికింది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన షూటింగ్ పనులు అన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం టెక్నీషియన్స్ అందరూ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ ప్రాజెక్టు నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయబోతున్నారని టాక్ వినబడుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వెంకటేష్ కూతురు సంగతి ఏమిటి?
తాజాగా వెంకటేష్ కుమార్తె ఆశ్రిత ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు లవ్ సింబల్ తో తన అభిమానాన్ని సోషల్ మీడియాలో చాటుకుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రేక్షకులతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం. ఇక వెంకటేష్ కూతురు కూడా తన తండ్రి అన్నయ్యతో పాటుగా ఏదో ఒక ప్రేములోనైనా కనబడబోతుందా అన్న అభిమానుల ఊహాగానాలకు ఇంకా సమాధానం తెలియాల్సి వుంది. ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో తన కోరికను వెళ్లబుచ్చింది కానీ, తాను నటిస్తున్నట్టు ఎక్కడ మెన్షన్ చేయకపోవడం దగ్గుబాటి అభిమానులను కాస్త నిరాశపరిచింది.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!