NewsOrbit
జాతీయం న్యూస్

Rahul Gandhi: ఢిల్లీలో కాంగ్రెస్ నిరసన ప్రదర్శన .. నేతల అరెస్టు ..ఈడీ కార్యాలయానికి చేరుకున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాం గాంధీ వాద్రాతో కలిసి కాంగ్రెస్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తరువాత కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ర్యాలీగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతించలేదు. రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయంలోకి విచారణ నిమిత్తం వెళ్లిన తరువాత ప్రియాంక గాంధీ పార్టీ శ్రేణులతో వెనుతిరిగారు.

Rahul Gandhi Reaches ED Office National Herald case
Rahul Gandhi Reaches ED Office National Herald case

Rahul Gandhi: కాంగ్రెస్ నేతల అరెస్టు

అయితే తమ అగ్రనేతపై కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలకు దిగింది. రాహుల్ గాంధీకి మద్దతుగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్, దిగ్విజయ్ సింగ్, పి చిదంబరం, జైరాం రమేష్, సచిన్ పైలట్, ముకుల్ వాస్నిక్, గౌరవ్ గొగోయ్, రాజీవ్ శుక్లా తదితర నేతలు పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తమ నేతకు మద్దతుగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుండి నేతలంతా ఈడీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. దేశ రాజధానిలో శాంతి భద్రతలత దృష్ట్యా నిరసన ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం కుదరదని ఢిల్లీ పోలీసులు ఆదివారమే కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేశారు. అయితే ముందు జాగ్రత్తగా పోలీసులు నేతలను అదుపులోకి తీసుకుని బస్సుల్లోకి ఎక్కించారు. ఏఐసీసీ కార్యాలయం, రాహుల్ నివాసం ముందు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అలాగే ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు వీధుల్లోకి వచ్చే అవకాశం ఉండటంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు విభాగం వివిధ ప్రాంతాల్లో స్టాపర్ లు ఏర్పాటు చేసి వాహనదారులకు మార్గదర్శకాలను జారీ చేసింది.

 

ఇదే కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాందీకి ఈడీ సమన్లు జారీ చేసిందేి. అయితే ఆమె ఈ నెల 2న కరోనా బారిన పడ్డారు. దీంతో 8వ తేదీ విచారణకు హజరు కాలేనని, మూడు వారాల సమయం ఇవ్వాలని ఈడీని కోరారు సోనియా గాంధీ. ఆ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ విచారణకు హజరు కావాలని ఈడీ తదుపరి సమన్లు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో కరోనా తదనంతర సమస్యల కారణంగా నిన్న సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. మరో పక్క ఢిల్లీలో పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా స్పందించారు. బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కు ప్రభుత్వం భయపడుతున్నట్లు కనబడుతోందన్నారు. మమ్మల్ని ఎవరూ అణచివేయలేరని అన్నారు. పేదల హక్కుల కోసం పోరాడతామనీ, 136 ఏళ్ల కాంగ్రెస్ ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉందంటూ బీజేపీపై విమర్షలు గుప్పించారు రణ్ దీప్ సుర్జేవాలా.

Related posts

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?