Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో హిమకు క్యాన్సర్ అని తెలియడంతో నిరూపమ్ షాక్ అవుతాడు. ఇక హిమ ఏమో ఎలాగయినా జ్వాలను పెళ్లి చేసుకోమని నిరూపమ్ దగ్గర మాటతీసుకుంటుంది. హిమ, నిరుపమ్ లు ఇద్దరు మాట్లాడుకోవడాన్ని జ్వాల దొంగచాటుగా వింటుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
డాక్టర్ సాబ్ కు ఐ లవ్ యూ చెప్పిన జ్వాల :
ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందంటే సౌర్య.. డాక్టర్ సాబ్ ను కలిసి మీకు ఎప్పటినుంచో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను అని ఐ లవ్ యూ డాక్టర్ సాబ్ అని నిరుపమ్ తో అంటుంది. దాంతో నిరుపమ్ ఒక్కసారిగా స్టన్ అయ్యి అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? అని అడుగుతాడు.జ్వాల ఏమి అర్ధంకాక అలానే చూస్తూ ఉంటుంది.ఇక ఆ తర్వాత నిరుపమ్ ఇంత లేటుగా గాన ఈ విషయం చెప్పడం అంటూ ఒక చిరునవ్వు నవ్వుతాడు.ఆ మాటకు జ్వాల కూడా చాలా సంతోషపడుతుంది.అయితే ఇదంతా జ్వాల జరిగినట్టు కలగంటుంది. ఇక కలలో నుంచి బయటకు వచ్చిన జ్వాల డాక్టర్ సాబ్ పేరు చెప్తేనే నా మనస్సు గాల్లో తేలిపోతుందని హిమతో అంటుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
జ్వాల విషయంలో కోపంతో మండిపోతున్న నిరూపమ్ :
సీన్ కట్ చేస్తే మరోవైపు నిరుపమ్ మాత్రం జ్వాలను నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి అని చిరాకు పడతాడు.ఇక హిమ నిరుపమ్ జ్వాలలను ఒక చోట కలపాలి అని. ప్లాన్ చేస్తుంది.. ఇక ప్లాన్ గురించి సౌర్యకు చెప్పడంతో ఇన్నాళ్లకు నా మనసులో మాట డాక్టర్ సాబ్ కి చెప్పేయబోతున్నాను అంటూ తెగ సంతోష పడుతూ ఉంటుంది..మరోవైపు ఆనందరావు, సౌందర్య ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.మళ్లీ మనకు సౌర్య కనిపిస్తుంది అంటావా? అని ఒకరికొకరు బాధపడుతూ ఉంటారు.ఇక సౌందర్య నిరుపమ్ తో పెళ్లి వద్దని చెప్పి హిమ ఒప్పించిన సంగతిని ఆనందరావు కు చెబుతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఏడో అడుగు వేయకుండానో వెనక్కి వెళ్ళిపోయిన జ్వాల :
సీన్ కట్ చేస్తే జ్వాల అందంగా చీర కట్టుకుని డాక్టర్ సాబ్ ను కలవడానికి అనుకున్న చోటుకి వస్తుంది.ఈలోపు జ్వాలకు డాక్టర్ సాబ్ కనిపించగా హలో డాక్టర్ సాబ్ అని అంటుంది.ఇక జ్వాల నిరుపమ్ దగ్గరకు వెళ్లడానికి హిమ ఏడు అడుగులను పూలతో ఎంతో అందంగా అలంకరిస్తుంది. ఇక జ్వాల ఎంతో ఆనందంగా ఒక్కో అడుగు వేసుకుంటూ వస్తుంది.కానీ నిరుపమ్ ఎంతో విచారంగా ఫీల్ అవుతూ.. రా జ్వాల నా మనసు అంతా హిమనె నిండి ఉంది.తననే నేను పెళ్లి చేసుకోబోయేది..అని నీకు స్పష్టంగా చెప్పేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈలోపు జ్వాల ఏడో అడుగుకు దగ్గరగా రాగానే రా జ్వాల ఇంకా ఒక్క అడుగు మాత్రమే ఉంది అని హిమ అనడంతో సరిగ్గా అప్పుడే జ్వాలకు అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వస్తుంది.దాంతో ఒక్కసారిగా స్టన్ అయ్యి అక్కడ నుంచి హడావుడిగా జ్వాల వెళ్లిపోతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
జ్వాలకు హిమలాగా ఫోన్ చేసింది ఎవరు..?
హిమకు చాలా కోపం వస్తుంది.ఆ మరుసటి రోజు ఉదయం హిమ.. జ్వాలను కలిసి నువ్వు అక్కడ నుంచి ఎందుకు వచ్చేసావు జ్వాల అంటూ చాలా సీరియస్ గా మాట్లాడుతుంది. నువ్వు చేసినది అసలు కరెక్ట్ ఏనా అని అడుగుతుంది. ఇక జ్వాల మాత్రం వెంటనే నా శత్రువు హిమ ఫోన్ చేసింది తింగరి అని చెబుతుంది.అందుకే అక్కడ నుండి. వచ్చేసాను అని అంటుంది. ఆ మాట విని హిమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. హిమ ఫోన్ చేయడం ఏంటి… నేనే హిమను కదా అని అయోమయంలో ఉంటుంది. ఇదంట శోభ ప్లాన్ అయి ఉంటుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!