Chor Bazaar: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన “చోర్ బజార్” సినిమా ప్రియ రిలీజ్ వేడుక నిన్న అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఆకాష్ పూరి తల్లి లావణ్య తోపాటు చెల్లి పవిత్ర ఇంకా బండ్ల గణేష్, సుబ్బరాజు, హీరో విశ్వక్ సేన్, “సర్కారు వారి పాట” డైరెక్టర్ పరశురాం మరికొంత మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా పరశురాం మాట్లాడుతూ.. పూరి అన్నయ్య లేకపోతే నేను లేను. హీరో ఆకాష్ పూరి నెలల బిడ్డ నాటినుండి నాకు బాగా తెలుసు. వీడికి సినిమా యే ప్రపంచం. సినిమా తప్ప మరొకటి ఏమీ తెలియదు. ఎప్పుడు ఫోన్ చేసినా సినిమా గురించే మాట్లాడతాడు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సక్సెస్ ఆకాష్ పూరికి ఎప్పటినుండో బాకీగా ఉంది. సో చోర్ బజార్ సినిమాతో సక్సెస్ నుండి రావలసిన చక్రవడ్డీ అన్ని వడ్డీలు కలిగి సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు డైరెక్టర్ పరుశురాం తెలియజేశారు. అనంతరం నటుడు సుబ్బరాజు మాట్లాడుతూ… పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా అప్పట్లో 2002లో వచ్చిన “అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి” సినిమా షూటింగ్ టైం లో ఒక ఫైట్ సీన్ కంప్లీట్ అయ్యాక పక్కన కూర్చున్నాను. ఆ టైంలో ఆకాష్ పూరి నా దగ్గరకు వచ్చి అంకుల్ నేను.. పెద్దయ్యాక మిమ్మల్ని అలా కొట్టవచ్చా అని అప్పుడే నాకు డైలాగ్ వేశాడు.
ఇదిలా ఉంటే డైరెక్టర్ జీవన్ రెడ్డి ఆకాష్ పూరితో సినిమా చేస్తున్నట్లు వార్త తెలియగానే ఆయన విప్లవాత్మక సినిమాలు చేస్తాడు. మరి ఆకాష్ పూరితో ఎటువంటి సబ్జెక్ట్ చేస్తాడు అని.. అనుకున్న సమయంలో “చోర్ బజార్” కాన్సెప్ట్ వినిపించారు. అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా మంచి అవుట్ పుట్ వచ్చింది.. ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది అంటూ సుబ్బరాజు తన స్పీచ్ ఇవ్వటం జరిగింది. జూన్ నెల 24 వ తారీకు “చోర్ బజార్” సినిమా విడుదల కానుంది.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?