Sonali bendre: సోనాలి బింద్రే గురించి పరిచయం అక్కర్లేదు. అందంతో పాటు అభినయం ఆమె సొంతం. అందుకే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే అమ్మడు మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించుకుంది. టాలీవుడ్ టాప్ స్టార్ అందరి సినిమాలో ఆడిపాడింది సోనాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి, తర్వాత వరుసగా నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. తరువాత మెల్లిమెల్లిగా అటు టాలీవుడ్ నుండి బాలీవుడ్ లో స్థిరపడిపోయింది. ఆ తరువాత కెరీర్ పీక్స్ లో వున్నపుడే ఫ్యామిలీకి పరిమితం అయిపోయింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Sonali bendre: ఇదేనా దానికి కారణం?
తరువాత కాలంలో కాన్సర్ బారిన పడటంతో ఆమె సినిమాలకు పూర్తిగా దూరంగా జరిగింది. అయితే ఈ క్రమంలో క్యాన్సర్‌ను జయించి, తన మనో ధైర్యం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది సొనాలి. ఇప్పటికే బుల్లి తెరపై జడ్జిగా సందడి కూడా చేస్తోంది. అయితే ఇటీవల ఈ బ్యూటీ మీద కొన్ని రూమర్స్ రాస్తున్నాయి పలు సైట్లు. ఈమె సినిమాల్లో మరలా యాక్ట్ చేయడానికి కారణం ప్రజెంట్ తన ఫినాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేకపోవడమే అని రాస్తున్నారు. అందుకే సినిమాలు చేస్తానంటూ మేకర్స్ ను అడుగుతుందని బీ టౌన్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Sonali bendre: సోనాలి వార్నింగ్?
ఇక తాజాగా ఓ మీడియా వేదికగా ఇంటర్వ్యూలో సోనాలి మాట్లాడుతూ.. అవన్నీ రూమర్సే అని కొట్టిపారేసింది. తన పరిస్థితి మంచిగానే ఉందని, తనకి ఎలాంటి ఆర్ధిక అవసరాలు లేవని, మానసిక రుగ్మతలు అస్సలే లేవని క్లారిటీ ఇచ్చింది. మంచి కథ దొరికితే సినిమాలు చేయాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడిని తెలుగులో రీ ఎంట్రీ చేయించాలని పలువురు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారని వినికిడి. ఇటీవల తారక్ సినిమాలో నటిస్తున్నారంటూ వచ్చిన వార్తలను కూడా సోనాలి కొట్టిపారేసిన విషయం తెలిసిందే.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!