అనుబంధాలకు నిలయం దేవత సీరియల్ అనే చక్కని టాగ్ లైన్ తో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.. తాజా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ లో దేవతా సీరియల్ 10.75 రేటింగ్ సొంతం చేసుకుని నాలుగో స్థానంలో నిలిచింది.. గత కొద్ది రోజులుగా దేవత సీరియల్ అదే స్థానంలో నిలుస్తూ వస్తోంది ఈ వారం కూడా తన స్థానాన్ని పదిలం చేసుకుంది.. ఈ సీరియల్ లో వచ్చేవారం ఊహించిన ట్విస్ట్ ఏమిటంటే.!?
మాధవ్ ఆదిత్య దగ్గరకు వెళ్లి దేవి నీ కూతురు కాదని రాధా దేవి ఇద్దరు నా భార్య పిల్లలు అని చెబుతాడు.. ఆ మాటకు కోపం వచ్చినా ఆదిత్య మాధవ చెంప చెల్లుమనిపిస్తాడు.. ఇప్పుడు అదే వీడియోను అడ్డం పెట్టుకొని రాధ నువ్వు కనుక దేవికి నిజం చెబితే.. నేను ఈ వీడియోను దేవికి చూపించి నాకు అనుకూలంగా చెప్పుకుంటాను అని అంటాడు.. ఈ విషయాన్ని రాధ ఆదిత్య కు చెబుతుంది.. ఆదిత్య మాధవ ఊహించని విధంగా ప్లాన్ చేస్తాడు.. ఈసారి మాదవ్ కచ్చితంగా ఆదిత్య ట్రాప్ లో పడాల్సిందే.. అలా మాధవ్ లాక్ అయ్యేలా ఆదిత్య ప్లాన్ చేస్తాడు..
ఈలోపు కమల డెలివరీ అవుతుంది కమలకు పండంటి ఆడపిల్ల పుడుతుంది.. ఆ ఆడపిల్లకు వాళ్ళ చెల్లి రుక్మిణి పేరు పెట్టుకోవాలి అని అనుకుంటుంది.. కమల బిడ్డను చూడడానికి రాద హాస్పటల్ కు వెళుతుంది.. వచ్చేవారం రెండు ట్విస్టులు ఉన్నాయి.. ఒకటి ఆదిత్య వేసిన ఎత్తులకు మాధవ్ అడ్డంగా దొరికిపోవడం.. దేవికి తన కన్న తండ్రి ఆదిత్య అని చెప్పేస్తాడు.. ఇంకొకటి కమల హాస్పటల్ లో ఉంటే చూడటానికి రాధలా వెళ్లిన రుక్మిణి అని తెలిసిపోతుంది..
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!