`క్రాక్`తో సక్సెస్ ట్రాక్ ఎక్కి.. `ఖిలాడి`తో ఫెయిల్ అయిన మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్గా `రామారావు ఆన్ డ్యూటీ` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
ఇందులో రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరో వేణు కీలక పాత్రను పోషించారు. జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. తొలి షో నుండే ఫ్లాట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 2.82 కోట్లు, రెండో రోజు రూ. 54 లక్షల రేంజ్లో షేర్‌ను రాబట్టిన ఈ చిత్రం.. మూడో రోజు సండే అయినా సరే రూ. 37 లక్షల షేర్ తోనే సరిపెట్టుకుంది. అలాగే వరల్డ్ వైడ్‌గా రూ. 42 లక్షల షేర్ ని అందుకుంది. దీంతో రవితేజ ఖాతాలో బిగ్ డిజాస్టర్ ఖాయమని, వీకెండ్ కలెక్షన్స్ తో అది తెలిపోయిందని సినీ ప్రియులు భావిస్తున్నారు. ఇక ఏరియాల వారీగా రామారావు ఆన్ డ్యూటీ వీకెండ్ కలెక్షన్స్‌ను ఓసారి గమనిస్తే..
నైజాం: 1.21 కోట్లు
సీడెడ్: 0.64 కోట్లు
ఉత్తరాంద్ర: 0.54 కోట్లు
తూర్పు: 0.37 కోట్లు
పశ్చిమ: 0.20 కోట్లు
గుంటూరు: 0.31 కోట్లు
కృష్ణ: 0.23 కోట్లు
నెల్లూరు: 0.15 కోట్లు
——————————
ఏపీ+తెలంగాణ= 3.65 కోట్లు(6.15కోట్లు~ గ్రాస్)
——————————
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 0.30 కోట్లు
ఓవర్సీస్: 0.43 కోట్లు
———————————-
టోటల్ వరల్డ్ వైడ్=4.38కోట్లు(7.60కోట్లు~ గ్రాస్)
———————————-
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 17 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 18 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే.. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ కాకుండా రూ.13.62 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంటుంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!