NewsOrbit
జాతీయం న్యూస్

ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ ఖడ్ ఘన విజయం .. పీఎం మోడీ సహా నేతల అభినందనలు

భారత 16వ ఉప రాష్టపతిగా ఎన్డీఏ అభ్యర్ధిగా రంగంలోకి దిగిన జగ్ దీప్ ధన్ ఖడ్ విపక్షాల అభ్యర్థి మార్గరేట్ అల్వాపై 346 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఉప రాష్ట్రపతి గా ఎన్నికైన జగ్ దీప్ ధన్ ఖడ్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలియజేశారు. శనివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 725 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోగా జగదీప్ ధన్ ఖడ్ కు 528 ఓట్లు వచ్చాయి. విపక్షాల అభ్యర్ధి మార్గరేట్ అల్వాకు కేవలం 182 మంది సభ్యులు మాత్రమే ఓటు వేశారు. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదని అధికారులు తెలిపారు. 55 మంది సభ్యులు పోలింగ్ కు దూరంగా ఉన్నారు.

 

లోక్ సభలో 23, రాజ్యసభలో 13 మంది సభ్యుల బలం ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే పార్టీ స్టాండ్ కు భిన్నంగా ఆ పార్టీకి చెందిన ఎంపీలు శశిర్ అధికారి, దిబ్వెందు అధికారి పోలింగ్ లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ విప్ జారీ చేసే అవకాశం లేనందున వీరు పార్టీ స్టాండ్ కు భిన్నంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా ఇద్దరు బీజేపీ ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనలేదు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరిగింది.

జగ్ దీప్ ధన్ ఖడ్ కు శుభాకాంక్షలు

ఉప రాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన జగ్ దీప్ ధన్ ఖడ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం శాఖ మంత్రి అమిత్ షా తదితరులు జగ్ దీప్ ధన్ ఖన్ నివాసానికి చేరుకుని వెళ్లి అభినందనలు తెలియజేశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేయారు. కాగా ఉమ్మడి విపక్షాల అభ్యర్ధి గా పోటీ చేసి ఓడిపోయిన మార్గరేట్ అల్వా తన ఓటమిని అంగీకరిస్తూ జగ్ దీప్ ధన్ ఖడ్ కు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ధన్ ఖన్ కు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియజేశారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju