Devatha: చిన్మయి దేవి దగ్గరికి వెళ్తానని గొడవ చేస్తుంది. రామ్మూర్తి గారు ఫోన్లో నుంచి ఆదిత్య కు ఫోన్ చేయిస్తుంది రాధ.. సారు చిన్మయి కూడా అక్కడికి వస్తాను అని అంటుంది అని రాధా చెబుతుంది .. పంపించండి అని అంటే ఇంట్లో ఎవరూ లేరు అని రాధ చెబుతుంది. సరే నేను కారు పంపిస్తాను అని ఆదిత్య అంటాడు.. దేవి ఎలా ఉంది అని అడగవా రుక్మిణి అని అడిగితే.. మీ దగ్గర ఉంటే నాకు దిగులే ఉంటుంది సారు అని రాధ అంటుంది..
రాధా గణపతి పూజకి చేయడానికి అందంగా రెడీ వస్తుంది. భాగ్యమ్మ అప్పుడే తన బిడ్డ రుక్మిణి చూసి ఆనందంతో నా బిడ్డ ఎంత అందంగా ఉందో అని మురిసిపోతూ ఉంటుంది. ఆ మాటలు విన్న జానకమ్మ రామ్మూర్తి ఇద్దరు షాక్ అవుతారు. తర్వాత భాగ్యమ్మ రాదని చూస్తూ తను కూడా నా బిడ్డ లాంటిదే కదా అందుకే అలా అన్నాను అని కవర్ చేసుకుంటుంది. వాళ్లు కూడా ఇంక ఏమీ అనకుండా మౌనంగా ఉంటారు. అప్పుడే మాధవ్ అక్కడికి వస్తాడు..
మాధవ్ రుక్మిణి అదోలాగా చూడటం భాగ్యమ్మ గమనిస్తుంది. వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని తన చేతిలో ఉన్న ప్రసాదం గిన్నెలు తీసుకువచ్చి మాధవ చేతికి అంటిస్తోంది. అయ్యో సార్ చూసుకోలేదు అని భాగ్యమ్మ అంటుంది. పిల్లలు ఎక్కడ అని అడిగాడు.. ఒకప్పుడు నువ్వు ఆదిత్య వాళ్ళింటికి పిల్లల్ని పంపించమంటే పంపించేదాన్ని కాదు.. ఇప్పుడు నువ్వు ఎందుకు పంపిస్తున్నావని రాధ ను మాధవ్ నిలదీస్తాడు.. పిల్లలు అంటే ఆ ఆఫీసర్ బాబు కూడా ఇష్టం అని రామ్మూర్తి అంటాడు.. ఏ ఇంకా తనకి జన్మలో పిల్లలు పుట్టరా.. పిల్లలే పుట్టుకోకుండా ఉండడానికి తనలో లోపం ఉందా అంటూ మాదం నోరు జరతాడు.. భాగ్యము కు కోపం వచ్చి పక్కనే ఉన్న దీపకు ప్రమీదతో మాధవ్ ని ఏదో ఒకటి చేయాలని చూస్తుంది.. రాధా కళ్ళతో ఏం చేయొద్దు అని సైగ చేస్తుంది..
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!