NewsOrbit
Telugu TV Serials న్యూస్

Karthikadeepam: సౌర్యను వెతికే పనిలో కార్తీక్… దుర్గ పెట్టే టార్చర్ తట్టుకోలేక అల్లాడిపోతున్న మోనిత..!

Karthikadeepam Today episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1483ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు అక్టోబర్ 15న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది.గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే కార్తీక్ కు గతం గుర్తుకు వచ్చినా గాని ఆ విషయం ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడతాడు. మరో పక్క దుర్గ వచ్చి కార్తీక్ కు మోనిత మీద అనుమానం వచ్చేలా మాట్లాడతాడు.

మోనిత మీద అనుమానపడ్డ కార్తీక్ :

Karthik, durga,monitha

ఈరోజు కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది.దుర్గ చెప్పిన మాటలు విని మోనిత కోపంతో ఏంట్రా నిన్న నేను నీతో కలిసి వచ్చానా అంటే ఆ అవును కదా అని చూడండి కార్తీక్ బాబు నిన్న మీరు జాతరలో తప్పిపోతే మిమ్మల్ని వెతకడానికి మేమిద్దరం రాత్రి అక్కడంతా వెతికాం.. మీరు ఎలాగో దొరకలేదని నన్ను తీసుకుని ఇంటికి వచ్చేసింది.. అప్పుడే ఇదిగో ఈ హ్యాండ్ బ్యాగ్ నా దగ్గరే ఉండిపోయింది’ అంటాడు. అది విన్న కార్తీక్.. మోనిత మీద అనుమానాన్ని నటిస్తూ.. కోపంగా లోపలికి వెళ్లిపోతాడు.కార్తీక్ కోపంగా లోపలికి వెళ్లిపోవడంతో.. మోనిత దుర్గ మీద రెచ్చిపోతుంది. ‘రేయ్ నీ సంగతి చూస్తాను. నీ అంతు చూస్తా’ అంటూ రెచ్చిపోతుంది. అవన్నీ తర్వాత చూద్దువుగానీ.. ముందు నీ భవిష్యత్ చూసుకో అంటూ దుర్గ వెటకారంగా నవ్వేసి అక్కడ నుండి వెళ్లిపోతాడు.

ఏమి జరిగిందో, జరుగుతుందో తెలియని అయోమయంలో కార్తీక్ :

Karthik

ఇక కార్తీక్ తన గదిలోకి వెళ్లి జరిగిన విషయాలు గుర్తుచేసుకుంటూ ఉంటాడు. అసలు మమ్మీ,డాడీ ఎక్కడున్నారు? నేను బతికే ఉన్నాను అని వాళ్ళకి తెలియదా..? యాక్సిడెంట్‌లో చనిపోయాం అనుకుంటున్నారా? అదే జరిగి ఉంటుంది.. లేదంటే రాకుండా ఎలా ఉంటారు? ఎంత పని చేశావ్ మోనితా అందరు ఉండి ఎవరు లేనివాడిలా చేసావ్ అంటూ రగిలిపోతాడు.అసలు దీప ఇక్కడెందుకు ఉంది.. హైదరాబాద్ వెళ్లలేదా? నేను మోనిత భర్తగా ఎందుకు ఉన్నాను? ఎక్కడా తేడా జరిగింది? దీప ఒక్కర్తే ఉంది.. మరి పిల్లలు ఏమయ్యారు. సౌర్య, వారణాసి ఇక్కడే ఉన్నారు.సౌర్య దగ్గర వినాయకుడి బొమ్మలు కొన్న సీన్ గుర్తు చేసుకుంటూ అయినా సౌర్య బొమ్మలు అమ్ముతుందేంటీ? అసలు అసలు ఏం జరుగుతుంది?’ అంటూ తలపట్టుకుని అల్లాడిపోతాడు.వెంటనే యాక్సిడెంట్ సీన్ గుర్తు చేసుకుంటూ ఆరోజు కార్ లోనుంచి హిమను కిందకు తోసేశాం.. హిమకు ఏం కాలేదు కదా? ప్రాణాలతోనే ఉంది కదా? అని అల్లాడిపోతాడు. అసలు ఏమి జరిగిందని వెళ్లి దీపను అడుగుదామనుకుంటాడు. మళ్ళీ వద్దు.. నాకు గతం గుర్తొచ్చిందని మోనితకి కూడా తెలిసిపోతుంది. అప్పుడే మోనిత వల్ల దీప ప్రాణాలకు ప్రమాదం వద్దు అనుకుంటాడు. అయినా ముందు సౌర్యని వెతకాలి.. తను దొరికాకే మిగతాది ప్లాన్ చేస్తాను.. అని ఫిక్స్ అవుతాడు కార్తీక్.

డాక్టర్ బాబులో వచ్చిన మార్పుకు దీప సంతోషం :

Deepa hapiness

ఇక దీప తన ఇంట్లో దుర్గ, దీప వాళ్ల అన్నయ్యకు భోజనం వడ్డించి డాక్టర్ బాబుని కూడా తినడానికి పిలుస్తాను’ అంటుంది. సరే అంటారు వాళ్లు. ‘డాక్టర్ బాబులో మార్పు కనిపిస్తోంది అని చాలా సంతోషపడుతుంది. దాంతో దుర్గ.. ‘తనకి గతం గుర్తొచ్చి కావాలనే నటిస్తున్నారేమోనని అనుమానంగా ఉంది దీపమ్మా’ అంటాడు. దానికి దీప నిజంగా ఆయనకు అన్ని గుర్తొస్తే అలా మోనితని వదిలేయకుండా లాగిపెట్టి కొట్టి తరిమేస్తారు. నన్ను తీసుకుని హైదరాబాద్ వెళ్లుండేవారు’ అంటుంది దీప.

సౌర్య గురించి వెతుకులాట మొదలుపెట్టిన కార్తీక్ :

Karthik enquiry about sourya

మరోవైపు కార్తీక్ ఇంటి బయట ఉన్న శివ దగ్గరకు వచ్చి కావాలనే మాధవ్ అని పిలుస్తాడు. ‘సార్ నా పేరు మాధవ్ కాదు శివ అంటాడు ‘తెలుసులేవయ్యా.. అనుమానం రాకుండా అలా పిలిచాను’ అని మనసులో కార్తీక్ అనుకుని.. ‘మీ మేడమ్ ఎక్కడా?’ అంటాడు. లోపలే ఉన్నారు సార్ పిలవమంటారా? అంటే వద్దులే గాని మనం ఒకసారి రోడ్డు మీద వినాయకుడి బొమ్మలు అమ్ముతున్న చిన్న పిల్ల దగ్గర బొమ్మలు కొన్నం గుర్తు ఉందా.. ఆ పాప కానీ మళ్లీ కనిపించిందా? కనిపిస్తే నాకు చెప్పు. మళ్ళీ ఇలా అడిగానని మీ మేడమ్‌కి తెలియకూడదు సరేనా?’ అంటాడు కార్తీక్.వెంటనే శివకు సంగారెడ్డి జాతరలో సౌర్య కనిపించిన విషయం చెబుతాడు. మీకు థాంక్స్ చెబుతాను అని ఆ పాప అంటే మీ దగ్గరకు తీసుకుని వస్తుంటే మేడమ్ చూసి ఆ పాపని వదిలి వెళ్లకపోతే నీ అంతు చూస్తు అని వార్నింగ్ ఇచ్చారు..ఎందుకో ఆ పాపని చూస్తే మేడమ్ భలే కంగారు అయిపోతారు సార్.. ’ అంటూ చెప్పుకొస్తాడు శివ.సరేలే ఇక మీ మేడమ్‌కి ఈ విషయం తెలియకుండా ఆ పాపని వెతికే పనిలో ఉండు అంటాడు.అంటే మోనితకి సౌర్య ఇక్కడే ఉన్న సంగతి తెలుసనమాట.ఎంత దుర్మార్గులావి మోనితా నువ్వు నా కుటుంబాన్ని ముక్కలు చేసి నన్ను సొంతం చేసుకోవాలని పథకం వేశావా? మా గురించి తెలియక బొమ్మలు అమ్ముకుని బతుకుతుంది నా కూతురు.. దానికి కారణం నువ్వే మోనితా.. నిన్ను ఊరికే వదలను.నీ అంతు చూస్తాను అంటాడు కార్తీక్.

నన్ను చంపడానికి రౌడీలను ఎందుకు పెట్టావ్ అంటూ మోనితను నిలదీసిన కార్తీక్ :

Karthik, monitha

ఇక కార్తీక్ ఆవేశంగా మోనిత దగ్గరకు వచ్చి వంటలక్కను చంపడానికి రౌడీలను ఎందుకు పంపావు అని మోనితను నిలదీస్తాడు. ఏంటి కార్తీక్ అలా మాట్లాడుతున్నావ్ అని మోనిత అంటే వంటలక్కను కాకపోతే నన్ను చంపడానికి రౌడీలను పంపవా అంటాడు. మోనిత షాక్ అయ్యి చూస్తుంటే అవును ఆ దుర్గా గాడికి, నీకు మధ్య అడ్డుగా నేను ఉన్నా అని నన్ను చంపాలని ప్లాన్ చేసావ్ అందుకే నా తలపై ఈ దెబ్బ తగిలింది అని అంటాడు.

Deepa, durga

అయితే వీళ్ళ మాటలను దీప చాటుగా విని అమ్మ… మోనిత నన్ను చంపడానికి రౌడీలను పెట్టావా అంటూ కోపమాతో దుర్గ దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెబుతుంది. దుర్గా ఇకమీదట నేను నీకు అడ్డు చెప్పను.నీకు నచ్చింది చేయి ఆ మౌనిత తన నోటి వెంబట తనే కార్తీక్ నాకు వద్దు.కార్తీక్ నా భర్త కాడు అని వదిలి వెళ్ళిపోయేలాగా చెయ్యి అని దుర్గకు చెబుతుంది.చూడు దీపమ్మ ఆ మోనితను ఒక ఆట అడ్డుకుంటా అని దుర్గ మోనిత దగ్గరకు వెళ్లడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

 

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri