NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. నేటి నుండి ఏపిలో వాహనాల ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ..వాటికి మాత్రమే డబ్బులు

ఏపిలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు నేటి నుండి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఎవై) పథకంలో భాగంగా జనవరి 2023 నుండి డిసెంబర్ 2023 వరకూ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపిలో ఇప్పటి వరకూ రెగ్యులర్ పీడీఎస్ బియ్యం, కందిపప్పు, పంచదార పంపిణీలను ఎండియూ ఆపరేటర్ ( డోర్ డెలివరీ వ్యాన్) ల ద్వారా పంపిణీ జరుగుతుండగా, ప్రధాన మంత్రి ఉచిత బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు.

Free Ration Distribution

 

ప్రధాన మంత్రి (పీఎంజీకేఏవై) బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు మాత్రమే మూడు నాలుగు నెలల నుండి ఉచితంగా పంపిణీ జరిగింది. అయితే  2023 జనవరి 1 వ తేదీ నుండి  మొత్తం రేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎండీయు వాహనాల ద్వారా బియ్యం కార్డులో ప్రతి మనిషికి 5 కేజీల చొప్పున ఉచితంగా పంపిణీ చేయనున్నారు. పంచదార, కందిపప్పులకు మాత్రమే డబ్బులు వసూలు చేయనున్నారు. ఒక వేళ ఎండీయు ఆపరేటర్ లు బియ్యంకి డబ్బులు వసూలు చేసినట్లు తెలిస్తే అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

రెగ్యులర్ పీడీఎస్ బియ్యం పంపిణీని నిలుపుదల చేసి పీఎంజీకేఏవై ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార (డబ్బులకు) ను రేషన్ కార్డుదారులకు ఎండియు (డోర్ డెలివరీ వ్యాన్) ఆపరేటర్ ల ద్వారా పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 1,45,43,997 రేషన్ కార్డులు ఉండగా, వాటిలో 90,27,636 ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు ఉన్నాయి. గత నాలుగైదు నెలల నుండి ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు మాత్రమే ఉచిత బియ్యం పంపిణీ చేశారు. పీఎంజీకేఏవై స్కీమ్, రెగ్యులర్ పీడీఎస్ కోటా లను కలిపి ఒకే పథకం గా మార్పు చేయడం ద్వారా నేడి నుండి మొత్తం కార్డుదారులకు ఎండీయు ఆపరేటర్ ల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు.

Related posts

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?