NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి సర్కార్ కీలక నిర్ణయం … వారికి గుడ్ న్యూస్  

ఏపి లో చాలా మంది ఆధార్ కార్డులో తప్పులు, మార్పులు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ లో తప్పులు ఉండటంతో ఎన్నో రకాల పనులు పెండింగ్ లో పడిపోతుంటాయి. ఆధార్ సెంటర్ లకు వెళితే అక్కడ రద్దీ వల్ల పనులు సకాలంలో అవ్వక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ అప్ డేట్ చేసుకోవడానికి సరైన సెంటర్ లు సమీపంలో అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

aadhar update centre at Grama Sachivalayam

 

ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు, అప్ డేట్ చేసుకునే అవకాశాన్ని గ్రామ సచివాలయాల్లో కల్పిస్తొంది. ఇవేళ 19వ తేదీ నుండి వరుసగా అయిదు రోజుల పాటు గ్రామ సచివాలయాల్లో ఆధార్ అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయాల్లో ఇందు కోసం ప్రత్యకే క్యాంప్ లు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ అయిదు రోజుల్లో ఆదార్ అప్ డేట్ చేయించుకోని వారి కోసం వచ్చే నెల ఫిబ్రవరి నెలలో 7వ తేదీ నుండి పదవ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు రెండో విడత క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ సాగిలి షన్ మోహన్ అన్ని జిల్లా కలెక్టర్లు, గ్రామ వార్డు సచివాలయాల శాఖ జిల్లాల ఇన్ చార్జి అధికారులు, జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జార చేశారు.

ప్రజలందరూ ఈ క్యాంపుల ద్వారా ఆధార్ సేవలు పొందేలా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ లు తగిన ప్రచారం చేయాలని సూచించారు. ప్రత్యేక క్యాంపుల రోజుల్లో సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు పూర్తిగా అధార్ సేవల పైనే దృష్టి పెడతారు.  ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన నిబంధన ప్రకారం పదేళ్లలో కనీసం ఒక సారి బయోమెట్రిక్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలి. ఇలా అప్ డేట్ చేసుకోని వారు రాష్ట్రంలో ఇంకా 80వేల వరకూ ఉన్నట్లు అధికారుల అంచనా. ఇప్పుడు వీరందరూ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ప్రత్యేక సెంటర్ లలో అప్ డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju