NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశం అంతా దళిత బందు, రైతు బంధు.. హామీల వర్షం కురిపించిన కేసిఆర్

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశం అంతా రైతు బంధు, దళిత బందు పథకాలను అమలు చేస్తామని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ హామీ ఇచ్చారు. పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలన్న లక్ష్యంతో మహారాష్ట్ర లోని నాందేడ్ లోని సబ్ ఖండ్ బోడ్ మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసిఆర్..మహారాష్ట్రలోని పలువుర నేతలకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసిఆర్ .. టీఆర్ఎస్ పార్టీని  బీఆర్ఎస్ గా ఎందుకు మార్చాల్సి వచ్చింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ప్రజలు పడుతున్న అవస్థలు, పాలకుల వైఫల్యాలను వివరిస్తూ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎటువంటి పథకాలను అమలు చేస్తామనేది వివరించారు. దేశ పరిస్థితులను చూసిన తర్వాత టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చామని అన్నారు.  దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు మారాయన్నారు. ఎందరో నేతలు ఏన్నో హామీలు ఇచ్చారు కానీ ఆ మేరకు మార్పులు రాలేదన్నారు. ఇప్పటికీ దేశంలో చాలా ప్రాంతాలకు కనీసం తాగునీరు, విద్యుత్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. మహారాష్ట్రలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.

KCR

 

రైతులు ఎంతో కష్టపడి పంటలు పండించినప్పటికీ ఆత్మహత్యలు తప్పట్లేదన్నారు. అందుకే ఆబ్ కీ బార్ .. కిసాన్ సర్కార్ నినాదంతో బీఎస్ఆర్ వచ్చిందన్నారు. ఎన్నాళ్ల నుండో ఎదురు చూశామనీ, ఇప్పుడు సమయం వచ్చిందన్నారు. నాగలి పట్టే చేతులు .. శాసనాలు చేయాల్సిన రోజులు వచ్చాయని కేసిఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలివాల్సింది నేతలు కాదనీ, ప్రజలు, రైతులు గెలవాలని అన్నారు. భారత్ పేద దేశం ఏ మాత్రం కాదనీ, భారత్ అమెరికా కంటే ధనిక దేశమని అన్నారు. భారత్ లో సమృద్ధిగా వనరులు ఉన్నప్పటికీ ప్రజలు వంచనకు గురి అవుతున్నారని అన్నారు. భారత్ లో ఉన్నంత సాగుయోగ్యమైన భూమి ఇంకెక్కడా లేదని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఇన్ని నదులు ఉన్నా నీటి కరవు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 54 సంవత్సరాలు కాంగ్రెస్, 16 ఏళ్లు బీజేపీ పాలించాయనీ, ఆ పార్టీ లు ఏమి సాధించాయని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయని విమర్శించారు. ముంజాలు, పతంగులు, దైవ ప్రతిమలు చివరకు జాతీయ జెండాలు కూడా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నామనీ అన్నారు. దేశ మంతటా చైనా బజార్లు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు.

BRS Meeting

 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించడం లేదన్నారు. ట్రైబ్యునళ్ల పేరుతో ఏళ్ల తరబడి జల వివాదాలు పెండింగ్ లో పెడుతున్నారన్నారు. ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా తిప్పుతున్నారన్నారు. చిత్తశుద్దితో కృషి చేస్తే దేశంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వొచ్చని అన్నారు.  ఇదే క్రమంలో తెలంగాణ అమలు చేస్తున్న సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బందు, రైతు భీమా, ఇంటింటికి మంచినీరు పథకాలను వివరిస్తూ ఇవన్నీ మహారాష్ట్ర లో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ఇలాంటి పథకాలు కావాలంటే రైతు సర్కార్ రావాలని అన్నారు. తెలంగాణలో వచ్చిన మార్పు దేశం అంతా రావాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం బొగ్గుతోనే దేశ వ్యాప్తంగా 24 గంటల విద్యుత్ ఇవ్వవచ్చని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోక వస్తే రెండేళ్లలో మహారాష్ట్రలో 24 గంటలు విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. వచ్చే పరిషత్ ఎన్నికల్లో మరాఠా ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించాలని కేసీఆర్ కోరారు. జిల్లాలోని నాందేడ్ సౌత్, నార్త్, బోకర్, నాయిగాం, ముఖేడ్, డెగ్లూర్, లోహా నియోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్ పట్టణాలు, ముద్కేడ్, బీలోలి, ఉమ్రి, హిమాయత్ నగర్ తదితర మండలాలోని అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో నాందేడ్ పట్టణంతో పాటు సభాస్థలికి నలుదిక్కులా కిలో మీటర్ల మేర ప్రాంతం అంతా గులాబీ మయంగా మారింది.

ఏపి కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N