NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

హైదరాబాద్ లో ఫార్ములా – ఈ రేసింగ్ .. సెలబ్రిటీల సందడి

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో జరుగుతొన్న ప్రతిష్టాత్మక ఫార్ములా – ఈ రేసింగ్ లో శనివారం పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. సినీ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు హజరయ్యారు. గ్యాలరీ నుండి తమ ఫేవరేట్ జట్టు అయన భారత్ కు చెందిన మహీంద్ర కు సపోర్టు చేశారు. సినీనటుడు నాగార్జున, రామ్ చరణ్, నాగ చైతన్య, అఖిల్, నవదీప్, సిద్దు జొన్నలగడ్డ, దర్శకుడు నాగ్ ఆశ్విన్, సినీ నిర్మాత అల్లు అరవింద్, క్రికెటర్లు యజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, శిఖర్ ధవన్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేసింగ్ ను వీక్షించారు.   ఫార్ములా వన్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన ఫార్ములా –  ఈ కావడంతో భాగ్యనగరం పూర్తి సందడిగా మారింది.

Celebrities flock to watch formula e racing in Hyderabad

 

ప్రధాన రేస్ కు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ రేసులను తిలకించిన క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేశారు. నెక్లెస్ రోడ్డులో రయ్యిమని దూసుకెళ్తున్న రేసింగ్ కార్లను చూస్తుంటే ముచ్చటేస్తుందని క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేస్ ప్రారంభమైంది. మొత్తం 2.8 కిమీ స్ట్రీట్ సర్క్యూట్ లో 11 ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలకు చెందిన 22 రేసర్లు పోటీల్లో పాల్గొన్నాయి. ఫార్ములా – ఈ లో ప్రస్తుతం 9వ సీజన్ నడుస్తొంది. ఇందులో ఇప్పటికే మూడు రేస్ లు పూర్తి అయ్యాయి. మెక్సికో సిటీలో మొదటి రేసుకు అతిథ్యం ఇవ్వగా, సౌదీ అరేబియాలోని దిరియాలో తర్వాతి రెండు రేసులు జరిగాయి. భారత దేశంలో ఇలాంటి రేసులు రావడం చాలా సంతోషంగా ఉందని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. భవిష్యత్తు లో ఇలాంటి అంతర్జాతీయ రేసింగ్ లు భారత్ లోనూ.. అందులోనూ హైదరాబాద్ లో మరిన్ని జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.

Celebrities flock to watch formula e racing in Hyderabad

 

వీరితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, ఏపికి చెందిన ఎంపీలు సీఎం రమేష్, కే రామ్మెహన్ నాయుడు, గల్లా జయదేవ్ ఫార్ములా రేస్ ను వీక్షించారు.  ఈ సందర్బంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఫార్ములా – ఈ రేసు హైదరాబాద్ వేదికగా జరగడం ఆనందకరమని పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్డులో ఫార్ములా ఈ కార్లు వేగంగా దూసుకువెళుతుంటే చూడటానికి ఎంతో బాగుందన్నారు. ఈ కార్యక్రమంతో హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ఆకాంక్షించారు.

Delhi Liquor Scam Case:  మాగుంట రాఘవరెడ్డి పది రోజుల ఈడీ కస్టడీ

Celebrities flock to watch formula e racing in Hyderabad

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju