NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ హవా.. ఎన్నికల ఫలితాలు ఇలా..

BJP Party : Big Political issues inside

ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. త్రిపుర, నాగాలాండ్ లో మెజార్టీతో మరో సారి అధికారంలోకి రాగా, మేఘాలయలో హాంగ్ వచ్చింది. మేఘాలయలో సిఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని పీపుల్స్ పార్టీ 26 స్థానాలు గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించినా, మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోలేకపోయింది. కాంగ్రెస్ అయిదు, బీజేపీ నాలుగు సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులు 24 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో సంగ్మాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్దమని బీజేపీ ప్రకటించింది.

BJP Party : Big Political issues inside
BJP Party :

 

నాగాలాండ్ లో ఎన్డీపీపీ – బీజేపీ కూటమి విజయం సాధించింది. అక్కడి అసెంబ్లీలో 60 సీట్లు ఉండగా, ఎన్డీపీపీ – బీజేపీ కూటమి 38 స్థానాలు కైవశం చేసుకుంది. ఎన్వీపీ 4, ఎన్వీఎఫ్ 2, ఇతరులు 16 స్థానాలు గెలుచుకున్నారు. త్రిపురలోనూ బీజేపీ కూటమిదే పైచేయిగా నిలిచింది. త్రిపుర అసెంబ్లీలో 60 సీట్లు ఉండగా, బీజేపీ – ఐపీటీఎఫ్ కూటమి 33 స్థానాలు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 31 కంటే రెండు స్థానాలు అధికంగా చేజిక్కించుకుంది.  కాంగ్రెస్ – వామపక్ష కూటమి 14 స్థానాలు దక్కించుకోగా, తొలి సారి ఎన్నికల బరిలో దిగిన తిప్రా మెథా పార్టీ 13 స్థానాల్లో సంచలన విజయం అందుకుంది. అయితే ఈ రాష్ట్రంలో బీజేపీ కూటమి అధిక్యం తగ్గడానికి కొత్త పార్టీ త్రిపా మోథానే కారణంగా కనబడుతోంది.

కాగా మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోడీ స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ సభలో మోడీ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో ప్రేమను చూపించారని కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. విజయం కంటే ప్రజలు చూపించే ప్రేమ ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల ప్రజల్లో ఉన్న ధృఢమైన విశ్వాసానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని వివరించారు. ఈశాన్య రాష్ట్రాలు ఢిల్లీకి దూరంగా ఉండొచ్చేమో కానీ తన హృదయానికి మాత్రం దగ్గరగానే ఉంటాయని మోడీ వ్యాఖ్యానించారు. ఇక ఓటమిని తట్టుకోలేని కొందరు ఈవీఎంలను తప్బుబడుతున్నారని విమర్శించారు.

ఏపి సర్కార్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం .. అమరావతి కేసు ఆ రోజునే విచారణ

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju