మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు శుభవార్త. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో పెన్షన్లు తీసుకునేవారు గతంలోకన్నా ఇంకో వెయ్యి రూపాయలు అదనంగా పొందనున్నారు. అంటే ఇకపై మా సభ్యులు రూ.6వేలను అందుకోనున్నారట. దాంతో పాటు ఇన్స్యూరెన్స్ గా గతంలో రెండు లక్షలు ఉండేది. ఇప్పుడు సభ్యులకు రూ.3లక్షల ఇన్స్యూరెన్స్ అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి అధ్యక్షుడు నరేష్, జీఎస్ జీవిత, వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ మీడియా ద్వారా అందరికీ తెలిపారు. సభ్యులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే 9502030405కి హెల్ప్ లైన్ ద్వారా కాంటాక్ట్ కావచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్ని సదుపాయాలను సభ్యులందరికీ దక్కేలా కృషి చేస్తామని వారు అన్నారు. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుని పింఛన్‌ను పెంచినట్టు వారు తెలిపారు. కొత్తగా సభ్యత్వం తీసుకోవాలనుకునేవారు మూడు నెలల్లో రూ.90వేలు కడితే శాశ్వత సభ్యత్వం ఇస్తామని, లేకుంటే రూ.25వేలు కట్టి, ఆ తర్వాత రెండేళ్లలోపు కనుక రూ.75 వేలు కడితే కూడా శాశ్వత సభ్యత్వం వస్తుందని వాళ్లు తెలిపారు.
previous post
next post
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!