NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి స్వల్ప ఊరట ..హైకోర్టు కీలక ఆదేశాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది.  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని వివేకా హత్య కేసులో సోమవారం వరకూ అరెస్టు చేయవద్దంటూ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఎంపి అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఇవేళ విచారణ జరిగింది. అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది సీబీఐపై కీలక ఆరోపణలు చేస్తూ వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డిని విచారించే సమయంలో విచారణ అధికారి పారదర్శకంగా వ్యవహరించడం లేదని తెలిపారు. అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారని హైకోర్టు ప్రశ్నించగా, ఆయన సీబీఐ విచారణకు వెళ్లారనీ, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

YS Viveka Murder Case

 

రెండు దఫాలుగా అవినాష్ రెడ్డి నుండి తీసుకున్న స్టేట్ మెంట్ ను పరిగణలోకి తీసుకోవద్దని కోర్టుకు తెలిపారు. జనవరి 28, ఫిబ్రవరి 24న చేసిన విచారణ స్టేట్ మెంట్లపై  తమకు అనుమానాలు ఉన్నాయని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.  సీబీఐ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరారు. రెండు సార్లు సీబీఐ జరిపిన విచారణ  ఆడియో వీడియో రికార్డింగ్ లేకుండా ఉందన్నారు. రెండు సార్లు విచారణ ముగిసిన తర్వాత అవినాష్ రెడ్డి నుండి సంతకాలు తీసుకోలేదని తెలిపారు. 40 నుండి 50 సార్లు అవినాష్ రెడ్డి స్టెట్ మెంట్ ను సీబీఐ ఎస్పీ రాంసింగ్ ఎటిట్ చేశారన్నారు. అవినాష్ రెడ్డి సంతకం లేనందున స్టేట్ మెంట్లు మార్చి ఉండొచ్చని అవినాష్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

వివేకా హత్య కేసులో అసలు నిందితుడు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డే అని అవినాష్ తరపు న్యాయవాది  పేర్కొన్నారు. అవినాష్ ను విచారణ కు పిలిచి అరెస్టు చేసే అవకాశం ఉందని అందుకే ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. మొత్తం రికార్డులు, ఫైల్స్ సోమవారం కోర్టుకు సమర్పించాలని సీబీఐకి ఆదేశించింది. విచారణ సమయంలో రికార్డు చేసిన వీడియోలను సోమవారం సమర్పించాలని తెలిపారు. సోమవారం వరకూ అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju